రాజకీయాల్లోకి వస్తా వివేకా హత్యకేసు నిందితుడు సునీల్ యాదవ్
ABN , Publish Date - Oct 05 , 2026 | 06:54 AM
తాను త్వరలో రాజకీయాల్లోకి వస్తానని మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు నిందితుడు సునీల్ యాదవ్ అన్నారు
గుంతకల్లు, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): తాను త్వరలో రాజకీయాల్లోకి వస్తానని మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు నిందితుడు సునీల్ యాదవ్ అన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో ఆదివారం నిర్వహించిన యాదవ ఆత్మీయ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. యాదవ కులసంఘ సమావేశం నుంచే తన రాజకీయ అరంగేట్రం ప్రారంభమైందన్నారు. వివిధ పార్టీలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, తన కేసులకూ రాజకీయానికీ ఎటువంటి సంబంధంలేదని అన్నారు. తనపై కేసు మాత్రమే పెట్టారని, కోర్టులో ఇంకా విచారణ ప్రారంభం కాలేదని, కనుక అసలు తాను దోషినే కాదని అన్నారు.