Share News

అపార్ట్‌మెంట్లకు ఫైర్‌ ఎన్‌వోసీ పరిమితి పెంపు

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:52 AM

ప్రజల నివాసానికి కొత్తగా నిర్మించే అపార్ట్‌మెంట్ల ఎత్తు పరిమితిపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది.

అపార్ట్‌మెంట్లకు ఫైర్‌ ఎన్‌వోసీ పరిమితి పెంపు
Apartment Fire NOC

  • 7 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు

హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రజల నివాసానికి కొత్తగా నిర్మించే అపార్ట్‌మెంట్ల ఎత్తు పరిమితిపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. అగ్నిమాపక దళ శాఖ జారీ చేసే తాత్కాలిక అగ్ని మాపక నిరభ్యంతర ధ్రువీకరణ పత్రానికి (ప్రొవిజనల్‌ ఫైర్‌ ఎన్‌వోసీ) అనుగుణంగా అపార్ట్‌మెంట్‌ ఎత్తు ఉండాలి. ఇప్పటి వరకూ 18 మీటర్లు (జీ+ 5 అంతస్తులు)గా ఉన్న పరిమితిని 24 మీటర్ల (జీ+7 అంతస్తులు)కు పెంచుతూ రాష్ట్ర అగ్నిమాపక దళ శాఖ జారీ చేసిన నిబంధనలు ఈ నెల ఏడో తేదీ నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయి. అయితే నివాస యోగ్య అపార్ట్‌మెంట్లకు మాత్రమే కొత్త నిబంధనలు వర్తిస్తాయి.


పాఠశాలలు, ఆస్పత్రులు, హోటళ్లు, హాస్టళ్లు, పరిశ్రమలు, మాల్స్‌, కార్యాలయాలు, ఇతర భవనాలకు ఈ మార్పు వర్తించదు. జాతీయ భవన నిర్మాణ ప్రమాణాలు (ఎన్‌బీసీఎస్) -2026కు అనుగుణంగా బిల్డర్ల సంఘాలతో జరిగిన చర్చల్లో తెలంగాణ అగ్ని మాపక దళశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 18 -24 మీటర్ల మధ్య ఎత్తు గల నివాస అపార్ట్‌మెంట్లకు ప్రొవిజనల్‌ ఫైర్‌ ఎన్‌వోసీ అవసరం లేకున్నా.. నిర్మాణ దశలో అకస్మికంగా అగ్నిమాపక దళ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారు. ఆయా భవనాల్లో సరైన ఎగ్జిట్‌ మార్గాలు, అత్యవసర లైట్లు, సురక్షిత విద్యుత్‌ వ్యవస్థలు, ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్లు వంటి ప్రాథమిక భద్రతా ఏర్పాట్లు ఉన్నాయా..? లేదా.. అని పరిశీలిస్తారు.


ఇవి కూడా చదవండి...
తొలగించిన కులాల పేరిట 2,123 బీసీ సర్టిఫికెట్లు.. విచారణకు బీసీ కమిషన్‌ ఆదేశం

గౌరవెల్లి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించాలి.. 98 శాతం పనులు పూర్తి: మంత్రి ఉత్తమ్‌
ఖమ్మంలో రూ.113 కోట్లతో వేంకటేశ్వరస్వామి ఆలయం.. 12న శంకుస్థాపన: మంత్రి తుమ్మల

Updated Date - Oct 04 , 2026 | 06:49 AM