12న ఖమ్మంలో వేంకటేశ్వర ఆలయం శంకుస్థాపన
ABN , Publish Date - Oct 04 , 2026 | 05:35 AM
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సహకారంతో అమరావతి తరహాలో ఖమ్మం నగరంలో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఈనెల 12న శంకుస్థాపన ..
12న ఖమ్మంలో వేంకటేశ్వర ఆలయ శంకుస్థాపన
టీటీడీ ఆధ్వర్యాన రూ.113 కోట్లతో నిర్మాణం: తుమ్మల
ఖమ్మం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సహకారంతో అమరావతి తరహాలో రూ.113 కోట్లతో ఖమ్మం నగరంలో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఈనెల 12న శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మంలోని అల్లీపురంలో శనివారం సాయంత్రం ఆలయ నిర్మాణ ప్రదేశాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌తో పాటు ఖమ్మంలో వేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణానికి టీటీడీ ముందుకొచ్చిందని, ఈ క్రమంలో ఖమ్మంలో 20ఎకరాలకు పైగా స్థలాన్ని టీటీడీకి అప్పగించామని వివరించారు. అలాగే ఖమ్మంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ ఆలయాన్ని కూడా నిర్మించబోతున్నట్లు వివరించారు.
ఇవి కూడా చదవండి...
శ్రీరాముడు అయోధ్యలో పుట్టినా.. అరణ్య వాసం చేసింది భద్రాద్రిలోనే
గౌరవెల్లి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించాలి.. 98 శాతం పనులు పూర్తి: మంత్రి ఉత్తమ్
ఎస్‌ఐఆర్‌పై ప్రకాశ్‌రాజ్ తీవ్ర ఆరోపణలు.. మోదీ, షానే సూత్రధారులు