Share News

రెచ్చగొట్టే రాజకీయాలు మానుకోవాలి: అద్దంకి దయాకర్

ABN , Publish Date - Jun 03 , 2026 | 05:55 PM

హరీష్‌రావుతో రాజకీయంగా ప్రమాదం ఉందని కేటీఆర్ గుర్తించారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. సీఎల్పీ మీడియా హాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బీఆర్ఎస్, బీజేపీ నాయకత్వాలపై విమర్శలు గుప్పించారు.

రెచ్చగొట్టే రాజకీయాలు మానుకోవాలి:  అద్దంకి దయాకర్
Addanki Dayakar

హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్‌రావుతో రాజకీయంగా ప్రమాదం ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తించారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. సీఎల్పీ మీడియా హాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు రాజకీయ అంశాలపై స్పందించారు.


హరీష్‌రావుతో కేటీఆర్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని, బీఆర్ఎస్‌లో నాయకత్వ సంక్షోభం నెలకొందని ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కూడా అద్దంకి దయాకర్ విమర్శలు చేశారు. పదవుల కోసం త్యాగాలు చేశానని చెప్పే కేసీఆర్, ప్రతిపక్ష నాయకుడి హోదాకు రాజీనామా చేయాలన్నారు.


ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై వస్తున్న విమర్శలను ఖండించిన ఆయన, భవిష్యత్తు లేని నాయకులకే ఫ్యూచర్ సిటీపై భయం పట్టుకుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టాప్-100 కంపెనీలను ఫ్యూచర్ సిటీకి తీసుకొచ్చే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అలాగే మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంపై కేటీఆర్‌కు పూర్తి అవగాహన లేదని, అవసరమైతే దానిపై ప్రత్యేకంగా క్లాస్ చెబుతామని ఎద్దేవా చేశారు.


బీజేపీ నాయకత్వంపై సొంత పార్టీ నేతలకే నమ్మకం లేదన్న అద్దంకి దయాకర్, ప్రజలు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. రెచ్చగొట్టే రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని ప్రయత్నించవద్దని ప్రతిపక్షాలకు అద్దంకి దయాకర్ సూచించారు.


Also Read:

ఎన్టీఆర్‌ గురించి కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. టీడీపీ నేతల ఫైర్

సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం.. బైకర్‌పైకి దూసుకెళ్లడంతో..

Updated Date - Jun 03 , 2026 | 05:59 PM