సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం.. బైకర్‌పైకి దూసుకెళ్లడంతో..
ABN , Publish Date - Jun 03 , 2026 | 04:05 PM
సికింద్రాబాద్ జూబ్లీహిల్స్ బస్టాప్ (జేబీఎస్) సమీపంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. జేబీఎస్ నుంచి కార్ఖానా వైపు వెళ్తున్న క్రమంలో అదుపు తప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లింది..
హైదరాబాద్, జూన్ 03: సికింద్రాబాద్ జూబ్లీహిల్స్ బస్టాప్ (JBS) సమీపంలో బుధవారం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. జేబీఎస్ నుంచి కార్ఖానా వైపు వెళ్తున్న బస్సు అదుపు తప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న శివ అనే ద్విచక్ర వాహనదారుడిని బలంగా ఢీకొట్టింది. దీంతో యువకుడు తన బైక్‌తో సహా బస్సు ముందు చక్రాల కింద ఇరుక్కుపోయాడు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి యువకుడిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ బస్సును జరపడం సాధ్యం కాలేదు. సమాచారం అందుకున్న మారేడుపల్లి ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే క్రేన్‌ను రప్పించి, బస్సును పక్కకు జరిపి, యువకుడిని బయటికి తీశారు. అనంతరం అతన్ని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడి ఇంట్లో ఏసీబీ సోదాలు
తెలంగాణకు నా మద్దతు సిద్ధాంతపరమే: పవన్ కల్యాణ్
Read Latest Telangana News And Telugu News