Share News

అమరావతిపై జగన్ విషం చిమ్ముతున్నారు: మంత్రి సవిత

ABN , Publish Date - Jun 03 , 2026 | 03:12 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిపై జగన్ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.

అమరావతిపై జగన్ విషం చిమ్ముతున్నారు: మంత్రి సవిత
Amaravati, S Savitha

అమరావతి, జూన్ 03: ఏపీ రాజధాని అమరావతి, రాష్ట్ర అభివృద్ధిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషం చిమ్ముతున్నారని.. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. జగన్ వైఖరి వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదని, ఆయన రాష్ట్రాన్ని ఎప్పటికీ అభివృద్ధి చేయనివ్వరని విమర్శించారు. రాజధాని విషయంలో స్థిరత్వం లేకపోవడమే వైసీపీ సిద్ధాంతమని మంత్రి సవిత దుయ్యబట్టారు.


‘‘రాజధానిపై రోజుకో మాట, పూటకో ప్రకటన చేయడం జగన్‌కు అలవాటుగా మారింది. గతంలో అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాష్ట్ర రాజధానిగా స్వాగతిస్తున్నామని జగన్ స్వయంగా చెప్పలేదా?" అని మంత్రి సవిత ప్రశ్నించారు. ‘‘మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పుకొనే జగన్.. అధికారంలోకి రాగానే మూడు రాజధానుల డ్రామా తెరపైకి తెచ్చి ఏ ప్రాంతాన్నీ అభివృద్ధి చేయకుండా వదిలేశారని మండిపడ్డారు. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన చేసిన జగన్.. ఇప్పుడు మావిగన్ అంటూ మరో మాట మాట్లాడుతున్నారు. నలుగురు కుటుంబ సభ్యులున్న జగన్ కోసం నాలుగు ప్యాలెస్‌లు నిర్మించుకోవచ్చు కానీ.. రాష్ట్రంలోని 5 కోట్ల జనాభా కోసం అంతర్జాతీయ స్థాయి రాజధానిని నిర్మించకూడదా?" అని మంత్రి నిలదీశారు.


ఇవి కూడా చదవండి..

ముఖ్యమంత్రి అంటే విజన్ ఉండాలి.. జగన్‌కు లేదు: మంత్రి నారాయణ

పెండింగ్‌‌లో ఉన్న రహదారి ప్రాజెక్టులు వేగంగా పూర్తి: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 03 , 2026 | 03:49 PM