Share News

రోడ్లు, భవనాల శాఖ మాజీ ఈఎన్‌సీ మోహన్ నాయక్ కేసులో ట్విస్ట్

ABN , Publish Date - Jul 09 , 2026 | 09:38 PM

ఆదాయానికి మించి అక్రమాస్తుల వ్యవహారంలో అరెస్టయిన రోడ్లు, భవనాల శాఖ ఈఎన్‌సీ మోహన్ నాయక్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మోహన్ నాయక్ బినామీలను ఏసీబీ విచారించింది.

 రోడ్లు, భవనాల శాఖ మాజీ ఈఎన్‌సీ మోహన్ నాయక్ కేసులో ట్విస్ట్
R And B ENC Mohan Naik

హైదరాబాద్, జులై 09: ఆదాయానికి మించి అక్రమాస్తుల వ్యవహారంలో అరెస్టయిన రోడ్లు, భవనాల శాఖ ఈఎన్‌సీ మోహన్ నాయక్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మోహన్ నాయక్ బినామీలను ఏసీబీ విచారించింది. అధికారిక లెక్కల ప్రకారం రూ.17 కోట్ల అక్రమాస్తులను మోహన్ నాయక్ బీనామీల పేరున పెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ క్రమంలో గురువారం మోహన్ నాయక్ మరదలు పద్మినిని ఏసీబీ అధికారులు విచారించారు. మోహన్ నాయక్‌కు ఆమె బినామీగా ఉన్నట్టు ఏసీబీ ఇప్పటికే గుర్తించిన సంగతి తెలిసిందే.


ఈ నేపథ్యంలో ఆమె స్టేట్‌మెంట్‌ను ఏసీబీ అధికారులు రికార్డ్ చేశారు. గచ్చిబౌలి డిఎల్ఎఫ్ వద్ద ఉన్న రెండు భవనాలను పద్మినీ పేరు మీద మోహన్ నాయక్ రిజిస్టర్ చేయించారు. ఆ ఫ్లాట్లు తనవి కాదని అధికారులకు పద్మిని స్పష్టం చేశారు. మోహన్ నాయక్ నగదుతోనే అతడు చెబితేనే రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి వెళ్లి సేల్ డీడ్ చేసుకున్నట్లు ఏసీబీకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పద్మిని వివరించారు.


ఈ స్టేట్‌మెంట్‌ను మెమో రూపంలో ఏసీబీ కోర్టులో అధికారులు ఫైల్ చేశారు. ఈ రెండు ప్లాట్ల విలువ రూ.2.44 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వైపు బినామీల ద్వారా పవర్ ప్రాజెక్టులోనూ మోహన్ నాయక్ పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ దిశగా వారు విచారిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారంటూ మోహన్ నాయక్‌ను ఇటీవల ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం విదితమే.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణలో పెట్టుబడులకు కెనడా ఆసక్తి.. సీఎం రేవంత్‌తో హైకమిషనర్ భేటీ

ధాన్యం కొనుగోళ్లలో కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు.. రేవంత్ సర్కార్‌పై కిషన్‌రెడ్డి ధ్వజం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 09 , 2026 | 09:59 PM