Share News

భారీగా డిఫెన్స్ మద్యం బాటిళ్లు స్వాధీనం.. ఒకరి అరెస్ట్

ABN , Publish Date - Aug 26 , 2026 | 06:00 PM

హైదరాబాద్ తార్నాక ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో భారీగా డిఫెన్స్ మద్యం బాటిళ్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం స్వాధీనం చేసుకుంది. మొత్తం 67 మద్యం బాటిళ్లను స్వాధీన పరుచుకుంది.

భారీగా డిఫెన్స్ మద్యం బాటిళ్లు స్వాధీనం.. ఒకరి అరెస్ట్
Defence Liquor Bottles

హైదరాబాద్, ఆగస్టు 26: నగరంలోని తార్నాక ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో భారీగా డిఫెన్స్ మద్యం బాటిళ్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం స్వాధీన పరుచుకుంది. మొత్తం 67 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ.2లక్షలు ఉంటుందని వివరించింది. తార్నాకలో ఓ వ్యక్తి డిఫెన్స్ మద్యం బాటిళ్లు విక్రయిస్తున్నట్లు.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీంకు సమాచారం అందింది.


దీంతో ఆ ఇంటిపై బుధవారం దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఆ ఇంటి యజమాని వద్ద తొలుత పది మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుంది. అనంతరం ఆ ఇంట్లో సోదాలు చేపట్టింది. ఈ సందర్భంగా మరో 57 బాటిళ్లను గుర్తించింది. వాటిని కూడా స్వాధీనం చేసుకుంది.


పట్టుబడిన బాటిళ్లు కర్ణాటక, హర్యానా రాష్ట్రాలకు చెందినవని స్పష్టం చేసింది. ఈ మద్యం బాటిళ్లు విక్రయిస్తున్న వ్యక్తి.. మాజీ సైనికుడి కుమారుడు ఆర్. మాధవన్‌గా గుర్తించామని పేర్కొంది. అతడిని సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అప్పగించామని ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం వివరించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇతరులకు నీతులు చెప్పే ముందు చరిత్ర చూసుకోవాలి జగన్‌: మంత్రి సత్యకుమార్ యాదవ్

ఉద్యోగానికి రాజీనామా చేసి.. బెజవాడ బయలుదేరిన భావన.. అంతలో..

For TG News And Telugu News

Updated Date - Aug 26 , 2026 | 06:11 PM