హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రమాదం.. టోపీ కోసం వెళ్లి..
ABN , Publish Date - Oct 27 , 2026 | 07:42 AM
గాలికి ఎగిరిపోయిన క్యాప్ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. టోపీని తీసుకునేందుకు వెళ్లిన యువకుడిని ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు.
హైదరాబాద్, అక్టోబర్ 27: టోపీ కోసం వెళ్లి.. ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాలికి ఎగిరిపోయిన క్యాప్‌ను తీసుకునేందుకు వెళ్లిన ఓ యువకుడిని ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. లక్ష్మారెడ్డిపాలెం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో నల్గొండకు చెందిన ఎమిరెడ్డి అవినాష్‌రెడ్డి (21) మృతి చెందాడు. ఎల్బీనగర్‌లో స్నేహితుడిని కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
అవినాష్‌రెడ్డి ఈ ఏడాదే బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. అతడి కుటుంబం పెద్దఅంబర్‌పేట డివిజన్ పరిధిలోని పసుమాముల కేజేఆర్ కాలనీలో నివాసం ఉంటోంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
దేవాదాయ శాఖలో అక్రమాలపై.. విజిలెన్స్ నివేదికలు బుట్టదాఖలు
ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్ల నిరాసక్తి!
Read Latest AP News And Telangana News