Share News

హైదరాబాద్ తిరుమలగిరి పరిధిలో రోడ్డు ప్రమాదం.. విద్యార్థి మృ‌తి

ABN , Publish Date - Aug 06 , 2026 | 11:52 AM

హైదరాబాద్‌లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని డైరీ ఫామ్ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు.

హైదరాబాద్ తిరుమలగిరి పరిధిలో రోడ్డు ప్రమాదం.. విద్యార్థి మృ‌తి
Hyderabad Road Accident

హైదరాబాద్, ఆగస్టు 6: తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని డైరీ ఫామ్ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కళాశాలకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు అకస్మాత్తుగా ప్రమాదానికి గురయ్యారు. ముందు వెళ్తున్న ఒక వాహనాన్ని ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించిన క్రమంలో బైక్ అదుపుతప్పింది. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.


ఈ ఘోర ప్రమాదంలో బైక్ నడుపుతున్న విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, మరో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తిరుమలగిరి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కంటిపాప జాగ్రత్త.. చిన్నారుల్లో మయోపియా ముప్పు

హైదరాబాద్‌లో భారీగా ఓట్ల కోత!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 06 , 2026 | 12:14 PM