హైదరాబాద్‌లో విషాదం.. అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత బలవన్మరణం..
ABN , Publish Date - Jul 23 , 2026 | 08:41 PM
హైదరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. అత్త, భర్త వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజేంద్రనగర్‌లో కలకలం రేపింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
హైదరాబాద్, జులై 23: నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. అత్త, భర్త వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజేంద్రనగర్‌లో కలకలం రేపింది. శ్రీదేవి అనే వివాహిత తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆమె అత్త, భర్త వేధింపుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, శ్రీదేవికి కొంతకాలంగా అత్తింట్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. తరచూ మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని, ఈ విషయాన్ని ఆమె పలుమార్లు తమకు తెలిపిందని మృతురాలి బంధువులు పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇంటిని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో రాజేంద్రనగర్ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. పోస్టుమార్టం నివేదిక, సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
యూపీఏ హయాంలో పేపర్లు లీక్.. కాంగ్రెస్ నేతలు ఎందుకు రాజీనామా చేయలేదు: కిషన్ రెడ్డి
ఉద్యమకారులను సాధ్యమైనంత త్వరగా గుర్తించి.. ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం: కేకే
For More AP News And Telugu News