Share News

దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టురట్టు

ABN , Publish Date - Jul 02 , 2026 | 02:59 PM

మెడిసిన్ బాక్సుల పేరుతో దేశవ్యాప్తంగా సాగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళితే..

దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టురట్టు
Hyderabad Drug Bust

హైదరాబాద్, జులై 2: దేశవ్యాప్తంగా సాగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW) పోలీసులు ఛేదించారు. వైద్య సామగ్రి, మెడిసిన్ రవాణా పేరుతో గుట్టుచప్పుడు కాకుండా పక్కదారి పట్టిస్తున్న ఒక పెద్ద ముఠా ఉనికిని పోలీసులు గుర్తించారు. ఈ ముఠా జార్ఖండ్ కేంద్రంగా పనిచేస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు గంజాయిని చేరవేస్తున్నట్లు విచారణలో తేలింది.


ఈ నెట్‌వర్క్‌పై నిఘా పెట్టిన హెచ్-న్యూ పోలీసులు.. జార్ఖండ్‌కు చెందిన ప్రధాన నిందితుడు రాహుల్‌ను అరెస్టు చేశారు. నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మెడిసిన్ బాక్సుల పేరుతో కొరియర్, ఇతర రవాణా మార్గాల ద్వారా గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ ముఠా కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని పలు ఇతర రాష్ట్రాల్లో విస్తృతంగా గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిందితుడి అరెస్ట్‌తో ఈ అంతరాష్ట్ర ముఠాకు సంబంధించిన మరికొంత మంది కీలక సభ్యుల వివరాలను రాబట్టేందుకు పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునే క్రమంలో పోలీసుల ఫైరింగ్

అకారణంగా నన్ను సాయికృష్ణ కేసులో ఇరికించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు: నాగరాజు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 02 , 2026 | 03:44 PM