Share News

Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం

ABN , Publish Date - Jan 07 , 2026 | 09:12 PM

ఇవాళ(బుధవారం) హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భోలక్‌పూర్ గుల్షన్ నగర్‌లో స్క్రాప్ గోదాం నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.

Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం
Hyderabad fire accident

హైదరాబాద్, జనవరి 07: ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి(Hyderabad Fire Accident)లోని భోలక్‌పూర్ గుల్షన్ నగర్‌లో స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో వరుసగా ఉన్న ప్లాస్టిక్ గోదాం, వైట్ల గోదామూకీ మంటలు విస్తరిస్తున్నాయి. స్క్రాప్ గోదాం నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.


స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి ముషీరాబాద్ పోలీసులు చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజిన్‌లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇటీవల చార్మినార్ ప్రాంతంలో కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగి.. పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

మున్సిపల్ ఎన్నికలపై కసరత్తు.. ఎస్ఈసీ కీలక ప్రకటన

కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవమే కానీ..: కేటీఆర్

Updated Date - Jan 07 , 2026 | 09:51 PM