హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల అక్రమ విక్రయాల ముఠా గుట్టురట్టు
ABN , Publish Date - May 06 , 2026 | 06:55 PM
నగరంలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లను తరలిస్తూ, బ్లాక్ మార్కెట్‌కు పాల్పడుతున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, 06: నగరంలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లను తరలిస్తూ, బ్లాక్ మార్కెట్‌కు పాల్పడుతున్న ఒక ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోయిగూడ ఐడీహెచ్ (IDH) కాలనీలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి సుమారు ఏడున్నర లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
భార్గవి గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్న ఇద్దరు డెలివరీ బాయ్స్.. ఏజెన్సీ యాజమాన్యానికి తెలియకుండా సిలిండర్లను దారి మళ్లించారు. కమర్షియల్ సిలిండర్లకు ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకోవాలని భావించిన వీరు.. ఈ అక్రమ దందాకు తెరతీశారు. అసలు ధర రూ. 3,337 ఉన్న సిలిండర్‌ను.. నాగార్జున అనే వ్యక్తికి ఒక్కో దాన్ని రూ. 3,500 నుంచి రూ. 3,800 వరకు విక్రయించారు. ఆ తర్వాత ఆ సిలిండర్లను నగరంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లకు రూ.5,000 చొప్పున అమ్మి భారీగా లాభాలు గడించారు.
మార్కెట్‌లోని డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న ఈ ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 129 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు, 4 సెల్ ఫోన్లు, ఒక ఆటో ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో పలు నామినేటెడ్ పోస్టుల భర్తీ
ప్రపంచస్థాయికి ఎక్కిన గొడ్డలి పార్టీ నేరాలు: టీడీపీ ఎమ్మెల్సీ
For More TG News And Telugu News