Share News

Telangana: అసెంబ్లీ సాక్షిగా అన్నీ అబద్ధాలే: హరీష్‌రావు

ABN , Publish Date - Jan 04 , 2026 | 12:27 PM

సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అన్నీ అబద్ధాలే చెబుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. కృష్ణా జలాల అంశంపై ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో పీపీటీ ఇచ్చారాయన.

Telangana: అసెంబ్లీ సాక్షిగా అన్నీ అబద్ధాలే: హరీష్‌రావు
Harish Rao

హైదరాబాద్, జనవరి 4: సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అన్నీ అబద్ధాలే చెబుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. కృష్ణా జలాల అంశంపై ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో పీపీటీ ఇచ్చారాయన. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు.. కాంగ్రెస్ చేసిన ద్రోహాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా అన్నీ అబద్ధాలే చెబుతున్నారన్నారు. ఉత్తమ్ కట్టుకథలు, రేవంత్ పిట్ట కథలు చెప్పారంటూ విమర్శించారు. రాజకీయాల కోసం తాము పీపీటీ ఇవ్వడం లేదన్నారు. ఫజల్ అలీ కమిషన్ చెప్పినా వినకుండా ఆంధ్రాలో కలిపి.. తెలంగాణకు ద్రోహం చేశారంటూ కాంగ్రెస్ నాయకుల తీరును తులనాడారు హరీష్ రావు.


పాలమూరు వలసలకు కారణమే కాంగ్రెస్ పార్టీ అని హరీష్ విమర్శించారు. నల్లగొండ జిల్లాకు మరణశాసనం రాసింది కూడా కాంగ్రెస్సే అని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనూ కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. 11వ షెడ్యూల్‌లో పాలమూరు-రంగారెడ్డి పెట్టలేదని చెప్పారాయన. రూ.200 కోట్లు ఖర్చు చేస్తే కాళేశ్వరం కింద 5లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని హరీష్ రావు వివరించారు. సొంత ప్రాంతానికే రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నారని విమర్శించారు.


Also Read:

Sacrifice Ritual For Wealth: నిధి కోసం తల్లిదండ్రుల దారుణం.. 8 నెలల బిడ్డను బలి ఇచ్చేందుకు..

Electric Geyser: ఎలక్ట్రిక్ గీజర్ వాడుతున్నారా? ఈ సంకేతం వస్తే జాగ్రత్త సుమీ.!

Irfan Pathan: అది మీకే తెలియాలి.. సెలక్టర్లపై ఇర్ఫాన్ పఠాన్ అసహనం

Updated Date - Jan 04 , 2026 | 03:17 PM