Sacrifice Ritual For Wealth: నిధి కోసం తల్లిదండ్రుల దారుణం.. 8 నెలల బిడ్డను బలి ఇచ్చేందుకు..
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:20 PM
ఓ భార్యాభర్తల జంట నిధి కోసం 8 నెలల చంటి బిడ్డను బలివ్వడానికి సిద్ధమైంది. చివరి నిమిషంలో వారికి ఊహించని షాక్ తగిలింది. పోలీసుల ఎంట్రీతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ఇద్దరూ అరెస్ట్ అయ్యారు.
బెంగళూరు రూరల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. డబ్బు మీద పిచ్చితో చంటిబిడ్డను చంపడానికి సిద్ధమయ్యారు తల్లిదండ్రులు. నిధి కోసం 8 నెలల పసి కందును బలి ఇవ్వడానికి చూశారు. అయితే, పోలీసుల ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది. చిన్నారి క్షేమంగా బయటపడింది. కీచక తల్లిదండ్రులు జైలు పాలయ్యారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. హొసకోటే తాలూకా, సులిబెలెలోని జనతా కాలనీకి చెందిన సయ్యద్ ఇమ్రాన్ పురాతన నిధుల కోసం గత కొంత కాలం నుంచి గాలిస్తూ ఉన్నాడు.
ఈ నేపథ్యంలోనే ఇంట్లోని ఓ గదిలో నిధి ఉన్నట్లు అతడికి తెలిసింది. నిధి తమకు దక్కాలంటే ఓ చిన్నారిని బలివ్వటం తప్పదని భావించారు. ఇందుకోసం 8 నెలల తమ బిడ్డను బలివ్వడానికి సిద్ధమయ్యారు. శనివారం రాత్రి నిధిని బయటకు తీయడానికి పూజలు మొదలయ్యాయి. గొయ్యి పూర్తిగా తవ్విన తర్వాత చంటి బిడ్డను బలివ్వడానికి సయ్యద్, అతడి భార్య అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, ఈ సమాచారం పోలీసులకు అందింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారు సయ్యద్ ఇంటి దగ్గరకు వెళ్లారు. పాపను కాపాడారు. భార్యాభర్తలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో ఆ బిడ్డ వారి బిడ్డ కాదని తేలింది. 8 నెలల క్రితం వలస కూలీ దగ్గరినుంచి పాపను దత్తత తీసుకున్నారు. తర్వాత పాప తల్లిదండ్రులము తామే అంటూ ఫేక్ బర్త్ సర్టిఫికేట్లు తయారు చేయించారు. నిధి కోసం పాపను బలివ్వటం కోసమే ఇదంతా చేసినట్లు పోలీసులు గుర్తించారు. పాపను పెంచుకుంటున్నారన్న సమాచారం తప్ప.. అధికారికంగా వారు పాపను దత్తత తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలను పోలీసులు గుర్తించలేదు. దీంతో పాపను శిశు కేంద్రకు తరలించారు.
ఇవి కూడా చదవండి
ఈ సారి కుందేలు తప్పక గెలుస్తుంది.. రైలు ముందు ఎలా పరిగెడుతోందో చూడండి..
మటన్ షాపులో దారుణం.. మూగ జీవాల రక్తం సేకరించి..