Share News

Rabbit race viral video: ఈ సారి కుందేలు తప్పక గెలుస్తుంది.. రైలు ముందు ఎలా పరిగెడుతోందో చూడండి..

ABN , Publish Date - Jan 04 , 2026 | 12:10 PM

జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ కుందేలుకు సంబంధించిన ఆసక్తికర వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

Rabbit race viral video: ఈ సారి కుందేలు తప్పక గెలుస్తుంది.. రైలు ముందు ఎలా పరిగెడుతోందో చూడండి..
rabbit race viral video

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ కుందేలుకు సంబంధించిన ఆసక్తికర వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (funny animal race).


చిన్నప్పుడు చదువుకున్న కుందేలు-తాబేలు కథ అందరికీ గుర్తుండే ఉంటుంది. అత్యంత వేగంగా పరిగెత్తే కుందేలు అతి విశ్వాసానికి పోయి తాబేలు చేతిలో ఓడిపోతుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ కుందేలు.. తాబేలుతో కాదు, ఏకంగా రైలుతోనే పోటీపడింది. రైలు హారన్ శబ్దం విని భయపడుతున్న కుందేలు చాలా వేగంగా పరుగులు పెడుతోంది. రైలు పట్టాల పక్కన ట్రైన్ కంటే వేగంగా ఉరుకుతోంది. రైలు ఇంజిన్‌లో ఉన్న డ్రైవర్ ఆ కుందేలు పరుగును వీడియో తీశాడు (rabbit wins race).


ఆ వీడియోను @AnisAli977633 అనే ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు (viral race on social media). ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోను ఇప్పటివరకు కొన్ని వేల మంది వీక్షించి, వందల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఈసారి కచ్చితంగా కుందేలే గెలుస్తుందని చాలా మంది కామెంట్లు చేశారు. కుందేలు గెలవడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తోందని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

న్యూయార్క్‌‌కు చేరుకున్న వెనుజువెలా అధ్యక్షుడు..

మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jan 04 , 2026 | 12:10 PM