డ్రోన్ టెక్నాలజీతో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు: మంత్రి తుమ్మల
ABN , Publish Date - May 23 , 2026 | 11:11 AM
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో (PJTSAU) రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విస్తృతంగా పర్యటించారు.
హైదరాబాద్, మే 23: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో (PJTSAU) రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలోని వివిధ పరిశోధనా విభాగాలు, ల్యాబ్‌లను సందర్శించిన ఆయన.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..‘డ్రోన్ టెక్నాలజీ సహాయంతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాగు ఖర్చులను తగ్గించడమే కాకుండా, పురుగుమందుల పిచికారీ వంటి పనుల్లో సమయం ఆదా అవుతుంది. డిజిటల్ అగ్రికల్చర్‌పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ల్యాబ్‌లలో జరిగే పరిశోధనలు కేవలం ప్రయోగాలకే పరిమితం కాకుండా.. సామాన్య రైతులకు అందుబాటులోకి రావాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆధునిక పరికరాలను సంప్రదాయ వ్యవసాయానికి జోడించినప్పుడే సాగు లాభసాటిగా మారుతుంది. అప్పుడే రైతు సంక్షేమం సాధ్యమవుతుంది’ అని మంత్రి అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గోల్డ్ ధరల ర్యాలీకి బ్రేక్.. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
మా వాట్సాప్ గ్రూప్‌లోనూ వైభవ్ గురించే చర్చిస్తున్నాం
Read Latest AP News And Telangana News And International News And Telugu News