Hyderabad: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు కొత్త వెబ్‌సైట్..
ABN , Publish Date - Jan 17 , 2026 | 07:37 AM
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు కొత్త వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధి పెరిగిన నేపధ్యంలో.. పోలీస్ కమిషనరేట్‌కు కూడా కొత్తగా రూపొందించారు. 5 జోన్‌లు, 44 పోలీస్ స్టేషన్‌లతో ఉన్న కమిషనరేట్‌ను ప్రస్తుతం 3 జోన్‌లు, 7 ఏసీపీ డివిజన్‌లు, 23 శాంతిభద్రతల పోలీస్ స్టేషన్‌ల పరిధులతో పునర్విభజన చేశారు.
- మారిన పరిధులతో ఏర్పాటు
హైదరాబాద్ సిటీ: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్(Cyberabad Police Commissionerate) స్వరూపం మారింది. జీహెచ్‌ఎంసీలో శివారు ప్రాంతాల్లోని 27 మునిసిపాలిటీలను విలీనం చేసిన తర్వాత.. ఏర్పాటైన జోన్‌లకు అనుగుణంగా పోలీస్ కమిషనరేట్‌ల పరిధులను నిర్ణయించారు. అందుకు అనుగుణంగా మార్పులు చేసి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్(Website)ను రూపొందించారు. పునర్విభజనతో ఇంతకు ముందున్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సగానికి తగ్గిపోయింది. 5 జోన్‌లు, 44 పోలీస్ స్టేషన్‌లతో ఉన్న కమిషనరేట్‌ను ప్రస్తుతం 3 జోన్‌లు, 7 ఏసీపీ డివిజన్‌లు, 23 శాంతిభద్రతల పోలీస్ స్టేషన్‌ల పరిధులతో పునర్విభజన చేశారు.

సైబరాబాద్‌లో 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లు
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రెండు డీసీపీ ట్రాఫిక్ జోన్‌లైన శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌లతో పాటు ఇద్దరు అడిషనల్ డీసీపీలు, నలుగురు ట్రాఫిక్ ఏసీపీలను నియమించారు. వారి పరిధిలో 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లు ఉండేలా రూపకల్పన చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
అవును.. శ్రీరాముడికి బీజేపీ సభ్యత్వం ఉంది
Read Latest Telangana News and National News