Share News

China manja: చైనా మాంజా.. యమ డేంజర్..

ABN , Publish Date - Jan 07 , 2026 | 10:08 AM

సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు.. ఎక్కడ చూసినా ఒక సంతోషకర వాతావరణం కనిపిస్తుంటుంది. వీటిలో పంతంగులు ఎగురవేయడం ఒకటి. అయితే... ఈ పతంగులకు చైనా మాంజా వాడుతుండడం ప్రమాదాలకు కారణమవుతోంది. ఈ మంజా చుట్టుకొని గాయపడడమేగాక ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.

China manja: చైనా మాంజా.. యమ డేంజర్..

- నిషేధం విధించినా కొన్ని ప్రాంతాల్లో విక్రయిస్తున్న వైనం

హైదరాబాద్: సంక్రాంతి పండుగ(Sankranti festival) వచ్చిదంటే చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహాంగా పతంగులను ఎగురవేస్తుంటారు. పతంగులను ఎగురవేస్తున్న వారు కొందరు చైనా మాంజా వినియోగిస్తున్నారు. చైనా మాంజా(China manja) వల్ల మనుషులకే కాకుండా జంతువులు, పక్షులకు ముప్పు ఏర్పడుతుండడంతో నిషేధించారు. అయినా అల్వాల్‌, లోతుకుంట, ఓల్డ్‌ అల్వాల్‌, టెంపుల్‌ అల్వాల్‌, మచ్చబొల్లారం, భూదేవినగర్‌ తదితర ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.


city7.3.jpg

పతంగుల పోటీలు...

యువత పోటీ పడి ఒకరి పతంగిని మరొకరు కట్‌ చేసి ఆనందపడుతుంటారు. చైనా మాంజా వినియోగించి ఎదుటువారి గాలిపటాన్ని కట్‌ చేసేందుకు బెట్టింగ్‌కు కూడా పాల్పడుతుంటారు. ఈ క్రమంలో పతంగుల నుంచి తెగిపడిన చైనా మాంజాలు విద్యుత్‌ స్తంభాలు, తీగలు, చెట్ల కొమ్మలకు చిక్కుకుంటున్నాయి. గాలికి అవి పాదచారులు, వాహనదారులపై పడడంతో గాయపడుతున్నారు.


చైనా మాంజా విక్రయిస్తే చర్యలు

city7.jfif

చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పతంగులకు నైలాన్‌ లేదా సాధారణ దారాలను మాత్రమే వినియోగించాలి.

- బాలగంగిరెడ్డి, ఏసీపీ, పేట్‌బషీరాబాద్‌


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ఎల్‌ఐసీ నుంచి జీవన్‌ ఉత్సవ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jan 07 , 2026 | 10:08 AM