Share News

తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థలకు పలు సిఫారసులు.. కాగ్ రిపోర్ట్ విడుదల..

ABN , Publish Date - Mar 30 , 2026 | 11:31 AM

తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల కార్యకలపాలు, లాభ నష్టాలపై కాగ్ నివేదిక విడుదల అయింది. 2023 మార్చి వరకు పబ్లిక్ సెక్టార్ పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో మొత్తం 83 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నట్టు, వాటిలో 16 సంస్థలు మూతపడినవి లేదా లిక్విడేషన్‌లో ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.

తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థలకు పలు  సిఫారసులు.. కాగ్ రిపోర్ట్ విడుదల..
CAG report Telangana

తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల కార్యకలపాలు, లాభ నష్టాలపై కాగ్ నివేదిక విడుదల అయింది. 2023 మార్చి వరకు పబ్లిక్ సెక్టార్ పనితీరుపై కంప్రోల్టర్ అండ్ ఆడిటింగ్ జనరల్ (కాగ్) కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో మొత్తం 83 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నట్టు, వాటిలో 16 సంస్థలు మూతపడినట్టు లేదా లిక్విడేషన్‌లో ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. మిగిలిన 67 సంస్థల్లో 49 ఖాతాలు సమర్పించడంలో ఆలస్యం చేశాయని పేర్కొంది. దీంతో కేవలం 18 సంస్థల పనితీరే విశ్లేషణకు తీసుకున్నట్టు కాగ్ వెల్లడించింది (CAG report Telangana).


విశ్లేషణకు తీసుకున్న 18 సంస్థల్లో 11 నష్టాల్లో ఉన్నాయని, కేవలం 6 సంస్థలు మాత్రమే లాభాల్లో ఉన్నాయని కాగ్ తెలిపింది. తొమ్మిది సంస్థల నెట్‌ విలువ పూర్తిగా నష్టాలతో కరిగిపోయినట్టు వెల్లడించింది. 71 సంస్థలు సమయానికి ఖాతాలు సమర్పించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. 15 సంస్థల్లో 9 స్వతంత్ర డైరెక్టర్ల నియామకం చేయలేదని, ఎక్కడా ఇండిపెండెంట్ డైరెక్టర్ల సమావేశాలు నిర్వహించలేదని పేర్కొంది. 5 సంస్థల్లో ఆడిట్ కమిటీ లేదని, 9 సంస్థల్లో ఎన్‌ఆర్‌సీ కమిటీ ఏర్పాటు కాలేదని తెలిపింది (Telangana PSUs audit).


ప్రభుత్వరంగ సంస్థలకు కాగ్ పలు సిఫారసులు చేసింది. నష్టాల్లో ఉన్న కంపెనీల పనితీరుని సమీక్షించాలని సూచించింది (CAG findings). నష్టాల్లో ఉన్న కంపెనీలను ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదా పూర్తిగా మూసివేయడం చేయాలని పేర్కొంది. అలాగే సింగరేణి కంపెనీకి కూడా పలు సూచనలు చేసింది. ఓబీఆర్ కాంట్రాక్టుల్లో భద్రతా నిబంధనలు మార్చాలని, బొగ్గు రవాణా ఛార్జీలను సమీక్షించాలని సూచించింది. తవ్విన గనులను తిరిగి నింపడానికి నది ఇసుకకు బదులు ప్రాసెస్ చేసిన బూడిద లేదా గనుల ఉపరితల పదార్థాలను వాడాలని తెలిపింది.


ఇవి కూడా చదవండి..

బిట్‌కాయిన్‌ దిగి వచ్చింది.. 67 వేల డాలర్ల దిగువకు..


ఇంటర్నెట్, నిత్యావసరాల కోసం ఇరాక్‌లోకి ఇరాన్ పౌరులు..

Updated Date - Mar 30 , 2026 | 11:33 AM