Share News

సికింద్రాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు కిందపడి బీటెక్ విద్యార్థి మృతి

ABN , Publish Date - Jun 04 , 2026 | 05:17 PM

సికింద్రాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం స్కిడ్ అయి ఆర్టీసీ బస్సు కింద పడిన ఘటనలో బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..

సికింద్రాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు కిందపడి బీటెక్ విద్యార్థి మృతి
Secunderabad Road Accident

హైదరాబాద్, జూన్ 04: నగరంలో కురిసిన కొద్దిపాటి వర్షానికి రోడ్డుపై బురద చేరింది. ఇదే ఓ విద్యార్థి ప్రాణాలు పోవడానికి కారణమైంది. సికింద్రాబాద్ పరిధిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. నగరంలో కురిసిన వర్షానికి రోడ్డుపై బురద చేరింది. ఈ క్రమంలో బైకుపై వస్తున్న ఓ యువకుడు స్కిడ్ అయి.. అదే సమయంలో పక్కనే వెళ్తున్న ఆర్టీసీ బస్సు కిందికి దూసుకుపోయాడు. బస్సు అతడి పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.


సమాచారం అందుకున్న మార్కెట్ స్టేషన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు గురునానక్ కాలేజీలో బీటెక్ చదువుతున్న మదన్ మోహన్‌గా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మదన్ మోహన్ అకాల మరణంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం అవసరం: సీఎం చంద్రబాబు

యువత ఓటు హక్కు వినియోగించండి.. ప్రజాప్రతినిధులను ప్రశ్నించండి: కోటంరెడ్డి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 04 , 2026 | 06:23 PM