Share News

మహిళల సంక్షేమం గురించి బీఆర్ఎస్ ఆలోచించలేదు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ABN , Publish Date - May 27 , 2026 | 09:10 PM

పదేళ్ల పాటు మహిళా సంఘాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

మహిళల సంక్షేమం గురించి బీఆర్ఎస్ ఆలోచించలేదు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bhatti Vikramarka fire on BRS Party

ఖమ్మం జిల్లా, మే 27: పదేళ్ల పాటు మహిళా సంఘాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ చేస్తున్న ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల పాటు మహిళా సంఘాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని, చివరకు మహిళల భవిష్యత్తుకు భరోసానిచ్చే 'అభయహస్తం' ప్రాజెక్టును కూడా కాలరాసి పక్కన పడేసిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో మహిళా లోకానికి జరిగిన అన్యాయాన్ని సరిచేస్తూ.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా పనిచేస్తోందని.. అందులో భాగంగానే మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన ప్రకటించారు.


తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నర ఏళ్ల స్వల్ప కాలంలోనే రికార్డు స్థాయిలో మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ. 66 వేల కోట్ల రుణాలను ఇప్పించిన ఘన చరిత్ర ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మహిళల క్షేమం, వారి ఆర్థిక పురోభివృద్ధే ధ్యేయంగా ప్రస్తుత ప్రభుత్వం అడుగులు వేస్తుంటే.. బీఆర్ఎస్ నాయకులు మాత్రం ప్రభుత్వం చేసే ప్రతి మంచి కార్యక్రమంపై విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుల దిగజారుడు ప్రకటనలు చూస్తుంటే అసహ్యం వేస్తోందని, ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వారి కుట్రలను, చర్యలను ప్రజాస్వామ్యంలో ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహానాడు-2026కు శ్రీకారం.. టీడీపీ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు

విజన్ పాలిటిక్స్‌కు టీడీపీ నాంది.. మహానాడులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - May 27 , 2026 | 09:27 PM