రంగారెడ్డి జిల్లాలో విషాదం: తల్లి మృతిని తట్టుకోలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య
ABN , Publish Date - May 27 , 2026 | 03:19 PM
రంగారెడ్డి జిల్లాలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లి మరణాన్ని తట్టుకోలేక.. ఓ ఆటో డ్రైవర్ తన నివాసంలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి జిల్లా, మే 27: జిల్లాలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లి మరణాన్ని తట్టుకోలేక.. ఓ ఆటో డ్రైవర్ తన నివాసంలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని మార్కండేయ నగర్‌కు చెందిన కొమురారెడ్డి (27) వృత్తిరీత్యా ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, సుమారు రెండు నెలల క్రితం అతని తల్లి మృతి చెందింది. అప్పటి నుంచి తల్లి మరణాన్ని జీర్ణించుకోలేక కొమురారెడ్డి తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు. ఆ మనోవేదన నుంచి బయటపడలేక, కాలక్రమేణా మద్యానికి బానిసయ్యాడు.
ఈ క్రమంలోనే తీవ్ర డిప్రెషన్‌కు లోనైన కొమురారెడ్డి, తన నివాసంలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నిండు నూరేళ్ల జీవితం ఉన్న యువకుడు ఇలా తల్లి ప్రాణాన్ని తలుచుకుంటూ తనువు చాలించడంతో మార్కండేయ నగర్‌లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
మహానాడు-2026కు శ్రీకారం.. టీడీపీ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు
విజన్ పాలిటిక్స్‌కు టీడీపీ నాంది.. మహానాడులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News