Share News

AI టెక్నాలజీతో డెలివరీ బాయ్ మోసాలు.. పోలీస్ వేషం వేసుకుని..

ABN , Publish Date - May 07 , 2026 | 03:11 PM

టెక్నాలజీని ఆసరాగా చేసుకుని సమాజాన్ని తప్పుదోవ పట్టించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి పోలీస్ అధికారిగా చలామణి అవుతున్న ఒక వ్యక్తిని రాజేంద్రనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..

AI టెక్నాలజీతో డెలివరీ బాయ్ మోసాలు.. పోలీస్ వేషం వేసుకుని..
AI Fake Police Videos

హైదరాబాద్, మే 07: టెక్నాలజీని ఆసరాగా చేసుకుని సమాజాన్ని తప్పుదోవ పట్టించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి పోలీస్ అధికారిగా చలామణి అవుతున్న ఒక వ్యక్తిని రాజేంద్రనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మైలార్‌దేవపల్లికి చెందిన అబూబకర్ అలీ అనే యువకుడు వృత్తిరీత్యా జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అయితే, ఈజీ మనీ కోసం ఏఐని అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదించాలని అనుకున్నాడు.


ఈ క్రమంలోనే అబూబకర్ అలీ AI అప్లికేషన్ల సాయంతో తను పోలీస్ యూనిఫాంలో ఉన్నట్లు ఫోటోలు, వీడియోలను సృష్టించాడు. ఈ ఫేక్ వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. తాను ఒక ఉన్నత పోలీస్ అధికారినని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాడు. కేవలం రీల్స్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. తనకు ప్రభుత్వంలో ఉన్నత స్థాయి పరిచయాలు ఉన్నాయని, ఎవరికైనా ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కావాలంటే ఇప్పిస్తానంటూ నమ్మబలికేవాడు.


సోషల్ మీడియాలో ఇతని హడావుడిని గమనించిన పోలీసులు అనుమానంతో నిఘా పెట్టారు. రాజేంద్రనగర్ టాస్క్ ఫోర్స్ బృందం కొన్ని రోజుల పాటు అతడి కదలికలను పరిశీలించగా.. అతడు ఫేక్ పోలీస్ అని తేలింది. దీంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళల భద్రతపై కమిషనర్ సుమతి స్పెషల్ ఫోకస్

హైదరాబాద్‌లో బెంగాల్ నటికి వేధింపులు.. నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 07 , 2026 | 05:29 PM