Share News

ఇద్దరు కౌలు రైతుల ఆత్మహత్య

ABN , Publish Date - Oct 08 , 2026 | 06:44 AM

వర్షాలు సరిగ్గా లేక పంట దిగుబడి రాదని, తీసుకున్న అప్పు తీరదని భావించిన ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఇద్దరు కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఇద్దరు కౌలు రైతుల ఆత్మహత్య
Tenant Farmers Died

భీంపూర్‌/తలమడుగు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : వర్షాలు సరిగ్గా లేక పంట దిగుబడి రాదని, తీసుకున్న అప్పు తీరదని భావించిన ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఇద్దరు కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భీంపూర్‌ మండలంలోని పిప్పల్‌కోటి గ్రామానికి చెందిన పనుల ఆశన్న(50) అనే రైతు తన కుటుంబానికి ఉన్న 4.30 ఎకరాల భూమిలో పత్తి పంట వేశాడు. అలాగే కౌలుకు తీసుకున్న మరో 4 ఎకరాల్లోనూ పత్తి వేశాడు. ఈ సంవత్సరం ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక, చేను పక్క నుంచే వెళ్తున్న పిప్పల్‌కోటి రిజర్వాయర్‌ కాలువ నుంచి నీరు రాకపోవడంతో పత్తి పంట దిగుబడి రాదని అనుకున్నాడు. సోమవారం చేను అంతా తిరిగాడు.


ఎండిపోతున్న పత్తి పంట చూసి కుమిలిపోయాడు. నేరుగా ఇంటికి వచ్చి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. అలాగే తలమడుగు మండల కేంద్రంలో కౌలు రైతు గుర్రాల ప్రతాప్‌ రెడ్డి(56) 20 సంవత్సరాలుగా భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది కూడా 23 ఎకరాలు వ్యవసాయ భూమి కౌలుకు తీసుకొని పత్తి, సోయాబీన్‌ పంటలను సాగు చేస్తున్నాడు. పంట పెట్టుబడి కోసం సుమారు రూ.తొమ్మిది లక్షల వరకు అప్పులు చేశాడు. వర్షాలు లేకపోవడంతో పంట దిగుబడి రాదనే అనుమానంతో మంగళవారం రాత్రి ఇంటిదగ్గర పురుగుల మందు తాగి మృతి చెందాడు.


ఈ వార్తలు కూడా చదవండి:

గోల్డ్ రేట్స్.. మళ్లీ పెరిగాయిగా.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..

నిమ్స్‌లో 24/7 ప్రత్యేక హెల్ప్‌లైన్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 06:44 AM