Share News

Nirmal Accident: ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురి మృతి..

ABN , Publish Date - Jan 20 , 2026 | 07:05 AM

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు- కంటైనర్ లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కారు అదుపు తప్పి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది.

Nirmal Accident: ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురి మృతి..
Nirmal Road Accident

భైంసా, జనవరి 20: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఇవాళ(మంగళవారం) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భైంసా బస్ డిపో సమీపంలో కారు- కంటైనర్ లారీ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.


మృతులు నిర్మల్ జిల్లా కుబేర్ మండలం కుప్టి గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది. మృతుల్ని బాబన్న, భోజరాం పటేల్, రాజన్న, వికాస్‌గా గుర్తించారు. ఈ నలుగురు హైదరాబాద్ నుంచి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.


కారు అదుపుతప్పి కంటైనర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనతో రోడ్డుపై రాకపోకలకు ఆటంకం కలిగింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి.

భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా..

ఏపీలో స్విస్‌ పెట్టుబడులకు సహకరించండి

Read Latest Telangana News and National News

Updated Date - Jan 20 , 2026 | 07:26 AM