కవిత పార్టీలో చేరిన ‘నాగోబా’ పూజారి
ABN , Publish Date - Sep 14 , 2026 | 07:11 AM
నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. కోస్గి, ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు కవిత వెల్లడించారు.
అక్టోబరులో కోస్గి, ఆ తర్వాత ఇంద్రవెల్లిలో భారీ సభలు : కవిత
హైదరాబాద్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని నాగోబా దేవాలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. ఆదివారం ఆ పార్టీ కార్యాలయంలో పలువురు సర్పంచులు, ముఖ్య నాయకులతో కలిసి ఆయన పార్టీలో చేరగా.. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కండువాలు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను నాగోబా భక్తురాలినని, ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన ప్రతిసారి నాగోబా ఆలయాన్ని దర్శించుకొని పూజలు చేస్తానన్నారు. ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు చేరికతో తమ బలం రెట్టింపయిందని చెప్పారు. ఈ నెల 20న కోస్గిలో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహిస్తామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
‘విజిలెన్స్’ దెబ్బకు..1,000 కోట్లు వసూలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News