నేడు ప్రపంచ 'పై' దినోత్సవం.. గూగుల్ డూడుల్ ప్రత్యేకత ఇదే..
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:28 PM
నేడు అంతర్జాతీయ 'పై' దినోత్సవం. దీనిపై ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది. ఇది గణితాన్ని వివిధ సబ్జెక్టులతో మేళవించే విధంగా ప్రజల దృష్టిని ఆకర్షించేలా ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: గూగుల్ డూడుల్.. సాధారణంగా ముఖ్యమైన దినోత్సవాలు, ప్రముఖుల జయంతులు, చారిత్రక సంఘటనలను గుర్తుచేస్తుంది. డూడుల్ సాధారణంగా ఇంటరాక్టివ్ యానిమేషన్, గేమ్ లేదా ప్రత్యేక చిత్రణతో కూడి ఉంటుంది. ఇది గూగుల్ హోమ్‌పేజీలో వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త విషయాన్ని తెలియజేస్తుంటుంది. నేడు 20వ శతాబ్దపు జీనియస్ అల్బర్ట్ ఐన్‌స్టీన్ జయంతి సందర్భంగా.. ప్రపంచ 'π(పై)' దినోత్సవం జరుపుకుంటారు. నేటి గూగుల్ డూడుల్ కూడా అదే చూపిస్తోంది. దీనిపై ప్రత్యేక వివరణ మీకోసం...
ప్రపంచం నేడు అంతర్జాతీయ 'పై' దినోత్సవం జరుపుకుంటోంది. π అనేది ఓ గణిత స్థిరాంకం. ఇది వృత్త వ్యాసం, పరిధులు అనుపాతంలో ఉన్నాయని సూచిస్తుంది. అంటే ఒక వృత్త పరిధిని దాని వ్యాసంతో భాగించగా వచ్చే విలువ. ఇది ఒక అసమాప్త సంఖ్య(Irrational Number). అంటే దాని దశాంశ రూపం అంతంకాకుండా ఆవర్తనం అవుతూనే ఉంటుంది. దీని ఉజ్జాయింపు విలువను సాధారణంగా 3.14గా సూచించినప్పటికీ.. వాస్తవానికి 3.14159...గా కొనసాగుతోంది. దీనిని అనేక గణిత సంబంధిత సూత్రాల్లో వినియోగిస్తారు.
ఎందుకంత ప్రాముఖ్యం?
పై దినోత్సవాన్ని ఒక అద్భుతమైన సంఖ్యగా మాత్రమే కాకుండా గణితం, సైన్స్‌ల అందాన్ని, వాటి ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడం. పై గణితం లేకుండా శాస్త్రీయ అధ్యయనాలు, శిల్పకళ, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, భౌతిక శాస్త్రం వంటి రంగాల్లో సమస్యలను పరిష్కరించడం అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రోజు ఒక అద్భుతమైన గణిత సంఖ్యతోనే కాకుండా.. గణితం ద్వారా మన జీవన విధానం, ప్రకృతిని అర్థం చేసుకోవడానికి శాస్త్రం, సాంకేతికత, ఇంజినీరింగ్‌ను ప్రేరేపించడం కోసం నిర్దేశించిన ఓ ప్రత్యేకమైన అవకాశం కూడా. నేటి ప్రత్యేకతను సూచిస్తూ పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, గణితా సంఘాలు.. వృత్తం, గణిత విషయాలపై వర్క్‌షాపులు, ప్రదర్శనలను నిర్వహిస్తాయి.
ఇవీ చదవండి:
ఆ పరీక్షా షెడ్యూల్‌పై సీబీఎస్ఈ క్లారిటీ.. ఆ వార్తలు ఫేక్ అని స్పష్టం
AI Vs ARపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ ప్రత్యేక విశ్లేషణ