పబ్లిక్ వైఫై వాడుతున్నారా? అయితే జాగ్రత్త..!
ABN , Publish Date - Nov 25 , 2026 | 07:24 PM
ఇటీవలి కాలంలో పబ్లిక్ వైఫై వినియోగం బాగా పెరిగింది. రైల్వే స్టేష్టన్లు, కెఫేలు, హోటళ్ల వంటి చోట్ల అందుబాటులో ఉండే వైఫైలను కనెక్ట్ చేసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలి కాలంలో పబ్లిక్ వైఫై వినియోగం బాగా పెరిగింది. రైల్వే స్టేష్టన్లు, కెఫేలు, హోటళ్ల వంటి చోట్ల అందుబాటులో ఉండే వైఫైలను కనెక్ట్ చేసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. అయితే ఈ పబ్లిక్ వైఫై అన్ని సార్లూ సురక్షితమైనది కాదని టెక్ నిపుణులు అంటున్నారు. ఇలాంటి నెట్‌వర్క్‌లను వినియోగించడం వల్ల సైబర్ ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. డిజిటల్ నేరగాళ్ల చేతిలోకి మీ వ్యక్తిగత డేటా చేరే అవకాశముందని చెబుతున్నారు. పబ్లిక్ వైఫై విషయంలో జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.
సాధారణంగా కొన్ని పబ్లిక్ వైఫైల్లో భద్రతాపరమైన లోపాలుంటాయి. అలాంటి నెట్‌వర్క్‌లకు కనెక్ట్ అయితే మీ వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో ఉన్నట్టే. నేరగాళ్లు ఇంటర్నెట్ ట్రాఫిక్ ద్వారా పాస్‌వర్డ్ డేటాను దొంగలించవచ్చు. బ్యాంకింగ్‌కు సంబంధించిన గోప్యమైన విషయాలనూ తెలుసుకోవచ్చు. పబ్లిక్ వైఫై కారణంగా ఇప్పటివరకు చాలా సైబర్ దాడులు జరిగాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఇలాంటి వైఫైలను వాడకూడదు. వీటిని వినియోగిస్తున్నప్పుడు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..
అధికారిక వైఫై: హోటల్స్, కెఫేలకు వెళ్లినప్పుడు అక్కడి సిబ్బందిని అడిగి అధికారిక వైఫే నెట్‌వర్క్ ఏంటో తెలుసుకోండి. దానికి మాత్రమే కనెక్ట్ అయి వినియోగించండి. ఇతర నెట్‌వర్క్‌ల జోలికి అసలు వెళ్లవద్దు.
ఆన్‌లైన్ చెల్లింపులు వద్దు: పబ్లిక్ వైఫై వాడుతున్నప్పుడు మీ బ్యాంక్ ఖాతా నుంచి డిజిటల్ చెల్లింపులు చేయకండి. మొబైల్ డేటాతోనే యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయండి.
వీపీఎన్ వాడొచ్చు: పబ్లిక్ వైఫై ఉపయోగిస్తున్న సమయంలో వీపీఎన్ వాడొచ్చు. ఇది వ్యక్తగత సమాచారాన్ని కాపాడుతుంది. అయితే సురక్షితమైన వీపీఎన్ మాత్రమే వాడాలి.
ఇవీ చదవండి
మీ వైఫై స్పీడ్ తగ్గిపోయిందా..? ఈ టిప్స్‌తో ఇంటర్నెట్ వేగం పెంచుకోండిలా..
నాపై కమిన్స్ మాటల దాడికి దిగుతాడని ఊహించలేదు: ఉస్మాన్ ఖవాజా