Share News

మీ వైఫై స్పీడ్ తగ్గిపోయిందా..? ఈ టిప్స్‌తో ఇంటర్నెట్ వేగం పెంచుకోండిలా..

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:19 PM

మీ వైఫై చాలా స్లోగా ఉందా..? అయితే ఇవి పాటించి స్పీడ్ పెంచుకోండి.

మీ వైఫై స్పీడ్ తగ్గిపోయిందా..? ఈ టిప్స్‌తో ఇంటర్నెట్ వేగం పెంచుకోండిలా..

ఇంటర్నెట్ డెస్క్: ఈ అత్యాధునిక డిజిటల్ యుగంలో అనేక పనులు వైఫై వేగంపైనే ఆధారపడి ఉంటాయి. అయితే కొన్నిసార్లు వైఫై మరీ స్లోగా ఉంటుంది. అలాంటప్పుడు మన పనులకు ఆటంకం కలగవచ్చు. దీంతో విలువైన సమయం వృథా అయిపోతుంది. ఇటీవలి కాలంలో చాలామంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోమ్ విధానంలో ఇంటి వద్దే విధులు నిర్వర్తిస్తున్నారు. తక్కువ ఇంటర్నెట్ స్పీడ్ వీరిని ఇంకా ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు సాంకేతిక నిపుణులు కొన్ని మార్గాలను సూచిస్తున్నారు. అవేంటంటే..?


ముందు ఈ పని చేయాలి..

వైఫై రూటర్ నిరంతరం ఆన్‌లో ఉండడం వల్ల సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశముంది. అందుకే ఎక్కువ సేపు ఆన్‌లో ఉన్న రూటర్‌ను ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేయాలి. ఇలా చేస్తే వైఫై వేగం అమాంతం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

సరైన స్థానంలో రూటర్..

ఇంటర్నెట్ వేగం ఎక్కువ ఉండాలంటే వైఫై రూటర్ ఎప్పుడూ సరైన స్థానంలో ఉండాలి. సాధారణంగా దాన్ని ఇంటి మధ్యలో అమర్చడం మంచిది. అప్పుడు సిగ్నల్స్ ఇల్లంతా సమానంగా వస్తాయి.


ఇదీ ముఖ్యం..

రూటర్‌ను గోడల దగ్గర, మూసి ఉన్న గదులలో లేదా బరువైన వస్తువుల వెనుక దాచి ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల వైఫై సిగ్నల్స్ బలహీనపడతాయి. తద్వారా ఇంటర్నెట్ వేగం తగ్గిపోతుంది.

ఆ డివైజ్‌లు తొలగించాలి..

వైఫైకి ఎన్ని డివైజ్‌లు అనుసంధానమై ఉన్నాయో తెలుసుకోవాలి. ఒకేసారి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయితే ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోతుంది. అందుకే అనవసరమైన డివైజ్‌లను తొలగించాలి.


ఇవీ చదవండి

వాట్సాప్‌లోనే పీఎఫ్ బ్యాలెన్స్.. ఎలా చూసుకోవాలంటే..?

తక్కువ మాట్లాడడం వల్ల ఇన్ని లాభాలా..?

Updated Date - Nov 06 , 2026 | 10:00 PM