తక్కువ మాట్లాడడం వల్ల ఇన్ని లాభాలా..?
ABN , Publish Date - Nov 04 , 2026 | 11:29 AM
జీవితంలో ఎదిగే వరకు చెవులు మూసుకోవాలి. ఎదిగిన తర్వాత నోరు అదుపులో పెట్టుకోవాలని పెద్దలు చెబుతారు. తక్కువ మాట్లాడే వారు జీవితంలో ఎక్కువ విజయాలు సాధిస్తారని చాణక్యుడు వివరించారు.
ఇంటర్నెట్ డెస్క్: జీవితంలో ఎదిగే వరకు చెవులు మూసుకోవాలి. ఎదిగిన తర్వాత నోరు అదుపులో పెట్టుకోవాలని పెద్దలు చెబుతారు. తక్కువ మాట్లాడే వారు జీవితంలో ఎక్కువ విజయాలు సాధిస్తారని చాణక్యుడు వివరించారు. మాటలు అదుపులో ఉంచుకోవడం నిజమైన తెలివితేటలకు సంకేతమని ఆయన అభివర్ణించారు. తక్కువగా మాట్లాడడం వల్ల ఆరు లాభాలు ఉన్నాయని తెలిపారు.
పెరగనున్న ఏకాగ్రత..
తక్కువ మాట్లాడే వ్యక్తి.. అనవసర మాటలు మాట్లాడి శక్తిని వృధా చేసుకోడు. అలాంటి వారు తమ లక్ష్యాలపై ఎక్కువగా దృష్టి పెడతారు. అంతేకాదు.. అర్థం లేని చర్చలకు వారు దూరంగా ఉంటారు. ఈ అలవాటు కారణంగా.. ఇతరుల కంటే ఎక్కువ ఏకాగ్రత సాధించడం ద్వారా వీరు జీవితంలో విజయాలు సాధిస్తారు.
అదే నిజమైన విజ్ఞానం..
తక్కువ మాట్లాడే వ్యక్తులు.. తాము మాట్లాడే ప్రతి విషయం గురించి ముందే ఆలోచిస్తారు. దేనికి వెంటనే స్పందించరు. ముందుగా పరిస్థితిని అర్థం చేసుకుంటారు. అందుకే వారి మాటలకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. అలా మాట్లాడే వారి మాటలను ప్రజలు కూడా శ్రద్ధగా వినేలా చేస్తుంది. ఇది వారి ప్రత్యేకతను చాటుతుంది.
ఇదో కళ..
తరచూ మాట్లాడేవారు.. ఏ మాత్రం ఆలోచించుకుండా మాట్లాడతారు. ఆ తర్వాత వివాదాలు వస్తాయి. అనంతరం పశ్చాతాపం వ్యక్తం చేస్తారు. ఒక్కో సారి క్షమాపణలు చెప్పే వరకు పరిస్థితి వెళ్తుంది. కానీ తక్కువ మాట్లాడం వల్ల అనవసర వివాదాల జోలికి వెళ్లే అవకాశం ఉండదు. అందుకే తక్కువ మాట్లాడం ఓ కళ.
మోసపోవడం చాలా తక్కువ
తక్కువ మాట్లాడే వారు.. ముందుగా తమ ప్రణాళికలు ఎవరికీ వెల్లడించరు. తమ ఆలోచనలు, ప్రణాళికలు చాలా కొద్దిమందికి మాత్రమే వివరిస్తారు. అలాంటి వారు మోసపోవడం కానీ.. హాని జరగడం కానీ చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది.
ఇదే ఉత్తమ మార్గం..
జీవితంలో తరచూ మౌనంగా ఉండడం అత్యత్తమమైన మార్గం. ఎదుటి వ్యక్తి కోపంలో ఉన్నా.. మనం చెప్పేది వినిపించుకునే మూడ్‌లో లేకున్నా.. ఆ సమయంలో మౌనంగా ఉండడమే అత్యుత్తమమైన మార్గం.
వారికే గౌరవం, ఆదరణ ఎక్కువ..
సమాజంలో తక్కువ మాట్లాడే వారికి ప్రత్యేక గౌరవం ఉంటుంది. అలాంటి వారికే మర్యాద కూడా ఉంటుంది. అందువల్ల వారి మాటలు.. ఇతరులపై ప్రభావాన్ని చూపుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
భానుడి నునులేత కిరణాల వల్ల ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా..
ఓటర్ల జాబితాలో పేరులేని వారు ఫాం 6 ద్వారా అప్లై చేసుకోవచ్చు: ఈసీ
For More LifeStyle News And Telugu News