వాట్సాప్‌లో వయోపరిమితి రానుందా.. కొత్త ప్రాంప్ట్‌తో యూజర్లలో చర్చ..
ABN , Publish Date - Aug 02 , 2026 | 08:16 PM
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త నిబంధనలను అమలు చేయనుందా? ఇకపై వాట్సాప్‌ను వినియోగించాలంటే నిర్ణీత వయసు కలిగి ఉండాలా?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త నిబంధనలను అమలు చేయనుందా? ఇకపై వాట్సాప్‌ను వినియోగించాలంటే నిర్ణీత వయసు కలిగి ఉండాలా? అవుననే అంటున్నారు కొందరు నెటిజన్లు. భారతదేశంలోని కొందరు వాట్సాప్ వినియోగదారులకు ఇటీవల పుట్టిన తేదీ నమోదు చేయాలని సూచించే కొత్త ప్రాంప్ట్ కనిపించడం చర్చనీయాంశంగా మారింది (WhatsApp age restriction).
వాట్సాప్ త్వరలో వయోపరిమితి లేదా ఏజ్ వెరిఫికేషన్ నిబంధనలు తీసుకురానుందా అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. అయితే, ఈ విషయంపై వాట్సాప్ లేదా దాని మాతృసంస్థ మెటా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. అలాగే భారత ప్రభుత్వం కూడా ఈ విషయంపై అధికారిక ప్రకటన జారీ చేయలేదు. ప్రాథమికంగా యాప్‌లో కనిపించిన కొత్త ప్రాంప్ట్ ఆధారంగానే ఈ చర్చలు జరుగుతున్నాయి (WhatsApp date of birth prompt).
ఇప్పటికే కొన్ని దేశాల్లో సామాజిక మాధ్యమాల వినియోగంపై పరిమితులు ఉన్నాయి (WhatsApp age verification). ఆస్ట్రేలియా వంటి కొన్ని దేశాలు 16 ఏళ్ల పిల్లలు సోషల్ మీడియా వాడడాన్ని నిషేధించాయి. దీంతో ఆయా దేశాల్లోని వినియోగదారులను వాట్సాప్ పుట్టిన తేదీ వివరాలు అడుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో కూడా భవిష్యత్తులో వయస్సు ధ్రువీకరణకు సంబంధించిన నిబంధనలు రావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు.
ఇవి కూడా చదవండి..
క్షమించి నా కూతురికి జీవనదానం చేశారు.. ప్రధాని మోదీకి బాలిక తల్లి కృతజ్ఞతలు..
వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..