Share News

iPhone నెమ్మదిస్తోందా? ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.. ఫలితం మీకే అర్థమవుతుంది!

ABN , Publish Date - Jan 02 , 2026 | 10:59 AM

ఐఫోన్ నెమ్మదిస్తున్నప్పుడు కొన్ని టిప్స్ పాటించాలని యాపిల్ చెబుతోంది. ఈ టిప్స్‌ను యథాతథంగా అమలు చేస్తే తక్షణ ఫలితం ఉంటుందని, ఫోన్ వేగం పెరుగుతుందని వివరించింది. మరి ఇవేంటో ఓసారి తెలుసుకుందాం పదండి.

iPhone నెమ్మదిస్తోందా? ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.. ఫలితం మీకే అర్థమవుతుంది!
Tips to Improve iPhone Performance

ఇంటర్నెట్ డెస్క్: కాలం గడిచేకొద్దీ చాలా మంది తమ ఐఫోన్‌ పనితీరు నెమ్మదించడాన్ని గమనిస్తుంటారు. ఆ మాటకొస్తే ఫోన్‌ వాడే ప్రతి ఒక్కరికీ ఇలాంటి అనుభవం ఎప్పుడోకప్పుడు ఎదురయ్యే ఉంటుంది. అయితే, ఐఫోన్ నెమ్మదిస్తోందని అనిపించినప్పుడు ఏం చేయాలనేదానిపై యాపిల్ కొన్ని టిప్స్‌ను పంచుకుంది. వీటిని ఫాలో అయితే తక్షణం సమస్య పరిష్కారం అవుతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు (iPhone Slowing Down..Tips to Follow).

సాధారణంగా ఫోన్ పనితీరు మెరుగ్గా అనిపించేందుకు ఐఫోన్‌లో యానిమేషన్స్, ట్రాన్సిషన్స్‌ ఫీచర్లు ఆన్‌లో ఉంటాయి. వీటిని ఆఫ్ చేస్తే ఫోన్‌పై భారం తగ్గి పనితీరు మెరుగవుతుందని యాపిల్ తెలిపింది. ఇందుకోసం సెట్టింట్స్‌లోకి వెళ్లి అందులోని యాక్సెసబిలిటీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తరువాత అందులోని మోషన్ ఆప్షన్‌లోగల రెడ్యూస్ మోషన్ ఫీచర్‌ను ఆన్ చేసుకుంటే తక్షణం ఫలితం కనిపిస్తుంది. గ్రాఫిక్స్‌పై భారం తగ్గి ఫోన్ మరింత వేగవంతంగా, త్వరితంగా స్పందిస్తున్నట్టు అనిపిస్తుంది.


బ్యాక్‌గ్రౌండ్ యాప్ రీఫ్రెష్

ఫోన్‌లోని యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరం రీఫ్రెష్ అవుతుంటాయి. యాప్స్‌ వాడకపోయినా ఇలా జరుగుతుంటుంది. దీని వల్ల బ్యాటరీ చార్జింగ్ తగ్గిపోవడంతో పాటు ఫోన్‌ కూడా నెమ్మదిస్తుంది. దీన్ని డిజేబుల్ చేస్తే తక్షణం ఫోన్ పనితీరు మెరుగవుతుందని యాపిల్ చెబుతోంది. దీన్ని ఆఫ్ చేసేందుకు సెట్టింగ్స్‌లోని జనరల్ ఆప్షన్‌ను ఎంచుకుని, అందులోని బ్యాక్‌గ్రౌండ్ రీఫ్రెష్‌ను ‘ఆఫ్‌’లోకి సెట్ చేసుకోవాలి. దీన్ని వైఫై ఓన్లీ ఆప్షన్‌కు సెట్ చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

క్యాష్‌ను క్లియర్ చేయడం

యాప్స్‌, ఇతర వెబ్‌సైట్స్‌కు సంబంధించిన సమాచారం ఫోన్‌లో క్యాష్ రూపంలో పేరుకుపోతుంది. క్రమం తప్పకుండా దీన్ని డిలీట్ చేస్తూ ఉంటే ఫోన్ సమర్థవంతంగా పనిచేస్తుంటుంది. ఇందుకోసం యాపిల్ సఫారీ బ్రౌజర్‌లోని సెట్టింగ్స్‌లో క్లియర్ హిస్టరీ అండ్ వెబ్ డాటా ఆప్షన్‌ను ఎంచుకని క్యాష్ డేటా మొత్తాన్ని క్లియర్ చేసుకోవచ్చు. దీంతో ఫోన్‌కు భారంగా మారిన తాత్కాలిక ఫైల్స్, ఇతర డేటా మొత్తం తొలగిపోయి ఫోన్ వేగవంతం అవుతుంది. ఈ టిప్స్‌ను ఫాలో అయితే ఐఫోన్ ప్రాసెసర్ వేగం పెరుగుతుందని యాపిల్ భరోసా ఇస్తోంది.


ఇవీ చదవండి

మార్చి వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్.. భారత్‌లోని హెచ్-1బీ ఉద్యోగులకు అమెజాన్ అనుమతి

వాహనంలో అర్ధరాత్రి వేళ మహిళపై అఘాయిత్యం.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

Updated Date - Jan 02 , 2026 | 11:00 AM