Share News

Phone Signal Problem: ఫోన్ సిగ్నల్స్ లేక ఇబ్బందా? వెంటనే ఇలా చేయండి!

ABN , Publish Date - Jan 01 , 2026 | 03:59 PM

ఫోన్ సిగ్నల్ లేదా? ఇలాంటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. వీటితో తక్షణం సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

Phone Signal Problem: ఫోన్ సిగ్నల్స్  లేక ఇబ్బందా? వెంటనే ఇలా చేయండి!
Network Issues Fix

ఇంటర్నెట్ డెస్క్: ఫోన్‌లో సిగ్నల్స్ తక్కువగా ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సిగ్నల్స్ ఎక్కడ బాగా అందుతాయో తెలుసుకునేందుకు అనేక మంది ఫోన్‌ను పట్టుకుని అటూ ఇటూ తిరుగుతుంటారు. అయితే, ఇలా చేసే ముందుకు కొన్ని చిట్కాల పాటిస్తే సమస్య తక్షణం పరిష్కారం అవుతుందని నిపుణులు చెబుతున్నారు (How to fix network Issues in phone).

ఎయిర్‌‌‌ప్లేన్ మోడ్ ఆన్ ఆఫ్

సిగ్నల్ లేని సమయాల్లో ముందుగా ఫోన్‌లోని ఎయిర్‌‌ప్లేన్ మోడ్‌ను కొన్ని సెకన్ల పాటు ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేయాలి. ఇది నెట్‌వర్క్ రీసెట్ మాదిరి పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల సమీప సెల్‌ టవర్‌కు మళ్లీ మీ ఫోన్ అనుసంధానం అవుతుంది. ఈ టెక్నిక్‌తో చిన్న చిన్న నెట్‌వర్క్ సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి.

నెట్‌వర్క్ మోడ్‌ మార్పు

చాలా మంది తమ ఫోన్‌ నెట్‌వర్క్‌ను 5జీకి సెట్ చేస్తారు. ఈ సిగ్నల్స్ లేని ప్రదేశాలకు వెళితే ఫోన్‌లో సిగ్నల్ మాయం అవుతుంది. ఇలాంటప్పుడు ఫోన్‌లోని నెట్‌వర్క్ సెట్టింగ్స్‌ను మారిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి అన్ని ప్రదేశాల్లో నిలకడైన సిగ్నల్స్ అందాలంటే ఫోన్ సెట్టింగ్స్‌లో వాయిస్, డేటా కోసం ఎల్‌టీఈని పెట్టుకోవాలని చెబుతున్నారు. నెట్‌వర్క్ వేగం కొద్దిగా తగ్గినా పెద్దగా ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు.


వైఫై కాలింగ్ ఫీచర్

ఫోన్ సిగ్నల్‌తో ఇబ్బంది పడే వారు వైఫై కాలింగ్ ఫీచర్‌‌ను కూడా వాడుకోవచ్చు. అయితే, ఇందుకు మీరు ముందుగా వైఫై నెట్‌వర్క్‌తో అనుసంధానం కావాల్సి ఉంటుంది. ఆ తరువాత ఫోన్ సెట్టింగ్స్‌లోని వైఫై కాలింగ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకుంటే ఎంచక్కా ఫోన్‌లో మాట్లాడుకోవచ్చు.

నెట్‌వర్క్ రీసెట్

సిగ్నల్ అందని సందర్భాల్లో ఫోన్‌ నెట్‌వర్క్ సెట్టింగ్స్‌ను ఒకసారి రీసెట్ చేస్తే కూడా తక్షణ ఫలితం కనిపిస్తుంది. ఇందుకోసం ఫోన్‌ సెట్టింగ్స్‌ రీసెట్ ఆప్షన్‌ను టాగల్ ఆన్ చేస్తే సరిపోతుంది.

సీమ్ కార్డును తీసి మళ్లీ పెట్టడం

ఇన్ని చేసినా ఫలితం లేదనుకున్నప్పుడు ఒకసారి ఫోన్‌లోంచి సిమ్ కార్డును తీసి మళ్లీ పెట్టడం మంచిది. ఇలా చేస్తే చాలా సందర్భాల్లో సమస్య చిటికెలో పరిష్కారం అవుతుంది. సిగ్నల్ పూర్తిస్థాయిలో అందుతుంది. ఇలా చేసినా కూడా ఫలితం లేదనుకుంటే మాత్రం సిగ్నల్ ఉన్న చోటకు వెళ్లి చూడటం మంచిది.


ఇవీ చదవండి:

ఈ ఏడాది శాస్త్రసాంకేతిక రంగాల్లో అద్భుతాలు.. ఆశ్చర్యపోవాల్సిందే

అంతరిక్ష రంగం.. ఇస్రో సారథ్యంలో భారత్‌కు అద్భుత విజయాలు

Updated Date - Jan 01 , 2026 | 04:09 PM