Sundar Pichai: ఒకేసారి 20 ఫోన్లు వినియోగించే సుందర్ పిచాయ్ ఒక రోజు సంపాదన ఎంతో తెలిస్తే..
ABN , Publish Date - Mar 11 , 2025 | 05:45 PM
ఒకేసారి 20 ఫోన్లు వినియోగించే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ రోజు సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆయనకు సంబంధించిన పలు ఆస్తికర విషయాలతో ఈ కథనం మీకోసం

ఇంటర్నెట్ డెస్క్: భారత దేశ ప్రతిభాపాటవాలు కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచవ్యాప్తం చేసిన వారిలో గుగూల్ సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) ముందు వరుసలో ఉంటారని చెప్పక తప్పదు. భారీ కార్పొరేట్ సంస్థకు నేతృత్వం వహిస్తున్న ఆయన రోజు వారి ఎంత బిజీగా ఉంటారో తెలిస్తే సామాన్యులు ఆశ్చర్యపోతారు. ఇక ఆయన సంపాదన ఎంతో తెలిస్తే నోట మాట ఆగిపోవడం పక్కా. అసలు తన ఎంత బిజీగా ఉండేది ఆయన ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. తాను ఓకేసారి 20 ఫోన్లు వాడిన సందర్భాలు కూడా ఉన్నాయని, గూగుల్ రూపొందించిన పలు సాంకేతికతలను వివిధ వేదికలపై పరీక్షించేందుకు ఇది అవసరమని ఆయన చెప్పుకొచ్చారు. టెక్నాలజీతో తన లైఫ్ ఇంతగా పెనవేసుకుపోయినా పిల్లలకు మాత్రం ఫోన్ల వినియోగంపై ఆంక్షలు విధిస్తానని కూడా ఆయన చెప్పారు.
Sundar Pichai: టెక్ రంగంలో ఏఐ తరువాత రాబోయే విప్లవం ఏదో చెప్పిన గూగుల్ సీఈలో
పిచాయ్ ప్రస్థానం ఇలా..
52 ఏళ్ల సుందర్ పిచాయ్ చెన్నైలో జన్మించారు. బాల్యం మొత్తం అక్కడే గడిచింది. రెండు రూములన్న ఎపార్ట్‌మెంట్‌లో అతి సాధారణ మధ్యతరగతి జీవితం గడిపారు. తండ్రి ఎలక్ట్రిక్ ఇంజినీర్ కాగా తల్లి స్టెనోగ్రాఫర్. స్థానిక స్కూళ్లల్లో చదువుకున్న ఆయన ఆ తరువాత ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తరువాత ఎమ్ఎస్ చదివేందుకు అమెరికాకు వెళ్లారు. స్టాన్‌ఫోర్డు యూనివర్సిటీలో మెటీరియల్ సైన్స్ ఇంజినీరింగ్, వార్టన్ స్కూల్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఎమ్‌బీఏ చేశారు. దాదాపు రెండు దశాబ్దాలుగా గూగుల్‌లో ఉన్నారు.
Chennai: గూగుల్ సీఈఓ సుందర్‌పిచ్చై పూర్వీకుల నివాసం విక్రయం
ప్రస్తుతం గూగుల్ సీఈఓగా ఉన్న సుందర్ పిచాయ్ వార్షిక ఆదాయం దాదాపు 2436 కోట్లని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. అంటే రోజుకు ఆయన దాదాపు రూ.6.67 కోట్లు ఆర్జిస్తున్నారన్న మాట. ఆయన సారథ్యంలో గూగుల్ టెక్ రంగంలో దూసుకుపోతుంది. అయితే, వ్యక్తిగత జీవితంలో తన పిల్లల టెక్ వినియోగంలో మాత్రం సుందర్ స్ట్రిక్ట్‌గా ఉంటారట. ఓ పరిమితికి మించి స్మార్ట్ ఫోన్ వాడొద్దని పిల్లలకు ఎప్పుడో స్పష్టం చేశారట. ఆన్‌లైన్ భద్రత విషయంలో కచ్చితంగా ఉండే సుందర్.. తన అకౌంట్లకు టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ పాస్‌వర్డ్ విధానాన్ని అమలు చేశారు. రాబోయే రోజుల్లో కృత్రిమమేధ అనేక అద్భుతాలు సృష్టిస్తుందని కూడా ఓ సందర్భంలో అన్నారు. మానవ చరిత్రలో ఏఐకి.. నిప్పు, విద్యుత్ ఆవిష్కరణలకు ఉన్న ప్రాముఖ్యత ఉందని కూడా తెలిపారు.