Gurgaon Incident: వాహనంలో అర్ధరాత్రి వేళ మహిళపై అఘాయిత్యం.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
ABN , Publish Date - Jan 02 , 2026 | 09:53 AM
హర్యానా అత్యాచార ఘటనలో తాజాగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. అర్ధరాత్రి వేళ నిర్మానుష్యంగా ఉండటంతో మహిళ ఎన్ని ఆర్తనాదాలు చేసినా సాయం అందలేదని తెలిసింది. అయితే, ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: హర్యానాలో ఇటీవల జరిగిన అత్యాచార ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అర్ధరాత్రి వేళ ఆర్తనాదాలు చేసినా బాధితురాలి అరుపులు అరణ్యరోదనలుగా మిగిలిపోయాయని పోలీసులు తెలిపారు. దట్టమైన పొగమంచు, చలి కారణంగా పరిసరాలన్నీ నిర్మానుణ్యంగా మారడంతో ఆమెను కాపాడే వారే లేకపోయారని తెలిపారు. మంగళవారం గుర్‌గావ్ - ఫరీదాబాద్ రహదారిపై ఈ దారుణం జరిగింది. నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు (Haryana Incident).
యూపీలోని ఝాన్సీ, మథురాకు చెందిన ఇద్దరు ట్రక్ డ్రైవర్లు యువతిపై (25) ఈ దారుణానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి వేళ మారుతీ సుజుకీ ఈకో వాహనంలో ఆమెను బలాత్కరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలు సోమవారం తల్లితో గొడవపడి తన స్నేహితురాలి వద్దకు వెళ్లింది. సాయంత్రానికే వచ్చేస్తానని తన సోదరికి చెప్పి వెళ్లింది. కానీ అనుకోకుండా ఆలస్యం జరగడంతో రాత్రి వేళ ఆలస్యంగా ఇంటికి బయలుదేరింది. ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో చివరకు లిఫ్ట్ అడిగి వ్యాన్‌లో ఎక్కింది. అప్పటికే వ్యానులో నిందితులు ఉన్న విషయం ఆమె గమనించలేదు. ఈ క్రమంలో నిందితులు ఆమెను మరో మార్గంలో తీసుకెళ్లారు. అర్ధరాత్రి, వేళ నిర్మానుష్యమైన మార్గంలో కదులుతున్న వాహనంలోనే ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.
బాధితురాలి ఆర్తనాదాలను ఆలకించే వారే లేకపోవడంతో దాదాపు మూడు గంటల పాటు ఆమె నరకం అనుభవించింది. నిందితులు ఒకరి తరువాత మరొకరు ఆమెపై దారుణానికి పాల్పడ్డారు. ఆ తరువాత బాధితురాలిని తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఎస్‌జీఎమ్ నగర్‌లోని ఓ హోటల్ వద్ద వదిలి వెళ్లారు. యువతి తన సోదరికి సమాచారం అందించడంతో ఆమె వచ్చి బాధితురాలిని ఫరీదాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఘటనలో యువతి ముఖంపై కూడా గాయాలు కావడంతో 12 కుట్లు వేయాల్సి వచ్చింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కారును స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చదవండి:
తాగారు.. చిక్కారు.. కూకట్‌పల్లిలో 163 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు
అమ్మో.. రూ.72 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..