29 బంతుల్లోనే శతక్కొట్టిన చాహల్.. ఏబీ డివిలియర్స్ రికార్డు బ్రేక్!
ABN , Publish Date - Jun 15 , 2026 | 09:29 PM
టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బ్యాట్‌తో ఇరగదీశాడు. కేవలం 29 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా 17 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బ్యాట్‌తో ఇరగదీశాడు. కేవలం 29 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా 17 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. అదేంటి.. చాహల్ బౌలర్ కదా? సెంచరీ ఎలా చేయగలిగాడనేగా ప్రశ్న! చాహల్ సెంచరీ చేసింది ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ యూట్యూబ్ ఛాలెంజ్ షోలో..!
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తన యూట్యూబ్ ఛానల్‌లో బ్యాటింగ్ ఛాలెంజ్‌లు, క్రికెటర్లతో సరదా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యుజ్వేంద్ర చాహల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. 50 బంతుల్లో 100 పరుగులు చేయాలని పీటర్సన్ చాహల్‌కు సవాలు విసిరాడు. అతడి కోసం బౌండరీని 40 మీటర్లకు కుదించాడు. సవాలును స్వీకరించిన చాహల్ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. ఆ తర్వాత కేవలం 29 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ ఛాలెంజ్‌లో చాహల్ రెండుసార్లు ఔటైనప్పటికీ ఐదేసి పరుగుల చొప్పున కోతతో తిరిగి బ్యాటింగ్ కొనసాగించాడు. పీటర్సన్ నిర్వహిస్తున్న ఈ ఛాలెంజ్‌లో శ్రేయస్ అయ్యర్ 22, వైభవ్ సూర్యవంశీ 25, నికోలస్ పూరన్ 28, డేవిడ్ మిల్లర్ 29 బంతుల్లో శతకం పూర్తి చేశారు.
ఇవి కూడా చదవండి:
ముక్కోణపు సిరీస్: సూపర్ ఓవర్‌లో శ్రీలంక-ఎ విజయం
దోహా డైమండ్ లీగ్: కమ్‌బ్యాక్ ఇవ్వనున్న నీరజ్ చోప్రా