Yuzvendra Chahal: ధనశ్రీతో రియాలిటీ షో.. ఆ వార్తలను ఖండించిన చాహల్
ABN , Publish Date - Jan 13 , 2026 | 02:18 PM
టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్-ధన శ్రీ కలిసి ఒక రియాలిటీ షో చేయనున్నారని.. విడాకుల తర్వాత ఒకే వేదికపై కలిసి కనిపించనున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చాహల్ స్పందించాడు. ఆ వార్తల్లో నిజం లేదని కొట్టి పారేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్-ధన శ్రీతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ కలిసి ఒక రియాలిటీ షో చేయనున్నారని.. విడాకుల తర్వాత ఒకే వేదికపై కలిసి కనిపించనున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 1 నుంచే ఆ షో ప్రారంభం కానుందని వార్తలు చక్కర్లు కొడుతుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో చాహల్(Yuzvendra Chahal) స్పందించాడు. ఆ వార్తల్లో నిజం లేదని కొట్టి పారేశాడు.
‘నేను ఏ రియాలిటీ షోలో పాల్గొనడం లేదు. నాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇవన్నీ పుకార్లు మాత్రమే. ఆ షోతో నాకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ రియాలిటీ షోకు సంబంధించి చర్చలూ, ఒప్పందాలు లేవు. ఇలాంటి పుకార్లను ఏ మీడియా కూడా ప్రచారం చేయొద్దు. ఇలాంటి వార్తలను నెటిజన్లు నమ్మకండి’ అని ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2026(IPL)లో చాహల్ మళ్లీ మైదానంలోకి దిగనున్నాడు. ఐపీఎల్ 2025 వేలంలో రూ.18 కోట్ల భారీ ధరకు అతడిని కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్, ఈ సారి మళ్లీ రిటైన్ చేసుకుంది. 2024లో ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచిన చాహల్.. టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకుని భారత్‌కు మరోసారి టైటిల్ అందించడంలో భాగమయ్యాడు.
ఇవి కూడా చదవండి:
క్యాసినోలో క్రికెటర్లు.. ప్రదర్శన కంటే వివాదాలకే ప్రాధాన్యత!
విరాట్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడినా.. ఫ్యాన్స్ బాధపడుతున్నారు: మహ్మద్ కైఫ్