టీ-20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు.. యువరాజ్‌కు దక్కిన గిఫ్ట్ ఏంటంటే..
ABN , Publish Date - Apr 16 , 2026 | 06:10 PM
2007 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టడాన్ని భారత క్రికెట్ అభిమాని ఎవరూ మర్చిపోలేరు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టాడు. ఆ అసమాన ఫీట్ సాధించిన యువరాజ్‌కు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఓ బీఎమ్‌డబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చారట.
2007 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టడాన్ని భారత క్రికెట్ అభిమాని ఎవరూ మర్చిపోలేరు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టాడు. ఆ అసమాన ఫీట్ సాధించిన యువరాజ్‌కు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఓ బీఎమ్‌డబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చారట. 2007 ప్రపంచకప్ సందర్భంగా జరిగిన ఆ సరదా సంఘటనను తాజాగా లలిత్ మోదీ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు (Yuvraj Singh six sixes gift).
'ఆ టోర్నమెంట్ సమయంలో నేను ఒకసారి భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాను. ఏదైనా ఒక మ్యాచ్‌లో ఏ ఆటగాడైనా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు, లేదా ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీస్తే.. అతడికి పోర్షే కారును బహుమతిగా ఇస్తానని వాగ్దానం చేశా. డర్బన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ ఓవర్‌లో యువీ ఆరు సిక్సర్లు కొట్టాడు. యువీ ఇన్నింగ్స్‌ను నేను స్టేడియంలో ఉండి వీక్షించా. మ్యాచ్ ముగిసిన అనంతరం యువరాజ్ నా దగ్గరకు వచ్చి.. నా పోర్షే కారు ఎక్కడ అని అడిగాడు' అని లలిత్ మోదీ వెల్లడించారు (Lalit Modi revelation Yuvraj).
'అప్పట్లో పోర్షే కారును దిగుమతి చేసుకోవడానికి ఆరు నెలల సమయం పట్టేది (Six sixes record India). అంతవరకు ఆగలేనని, పోర్షేకు బదులుగా బీఎమ్‌డబ్ల్యూ తీసుకుంటానని యువీ చెప్పాడు. మేం బీఎమ్‌డబ్ల్యూ షోరూమ్‌కు వెళ్లి కారు కొని తాళాలను యువరాజ్‌కు ఇచ్చాం. ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టిన బ్యాట్‌ను నాకు ఇవ్వాలని యువరాజ్‌ను అడిగా. యువీ సంతోషంగా ఆ బ్యాట్‌ను నాకు ఇచ్చాడు. ఆ బ్యాట్ 50 పోర్షే కార్ల కంటే విలువైనది' అని లలిత్ మోదీ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
అమెరికా-ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలు.. సమాచారం లేదంటున్న పాకిస్థాన్
వేలాది అమెరికా సైనికులను బందీలుగా పట్టుకుంటాం: ఇరాన్ హెచ్చరిక
లాభాల నుంచి నష్టాల్లోకి.. స్టాక్ మార్కెట్లకు నష్టాలు..