WPL 2026: ఆఖర్లో ఢిల్లీ మెరుపులు.. బెంగళూరు టార్గెట్ 167..
ABN , Publish Date - Jan 17 , 2026 | 09:22 PM
డబ్ల్యూపీఎల్ 2026లో భాగంగా నవీ ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుని.. తొలుత ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 166 పరుగులకు ఆలౌటైంది..
ఇంటర్నెట్ డెస్క్: డబ్ల్యూపీఎల్ 2026లో భాగంగా నవీ ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుని.. తొలుత ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 166 పరుగులకు ఆలౌటైంది. బెంగళూరుకు 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి రెండు ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఢిల్లీని ఓపెనర్ షఫాలీ వర్మ (62; 41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులు) దూకుడుగా ఆడి ఆదుకుంది. ఆమె కూడా పెవిలియన్ చేరిన తర్వాత.. స్వల్ప స్కోరు లాంఛనమే అన్న సమయానికి హ్యామిల్టన్(36; 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులు) చెలరేగింది. మరో ఎండ్‌లో ఉన్న శ్రీచరణి (11; 11 బంతుల్లో 1 ఫోర్) పర్వాలేదనిపించింది. ఆఖరులో మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఢిల్లీ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది.
ఢిల్లీ బ్యాటర్లలో లిజెల్లె లీ(4), లారా వోల్వార్ట్(0), జెమీమా రోడ్రిగ్స్(4), కాప్(0), నికీ ప్రసాద్(12), మిన్ను మనీ(5).. ఆర్సీబీ బౌలర్ల ధాటికి పెవిలియన్‌కు క్యూ కట్టారు. స్నేహ్ రాణా(22) పర్వాలేదనిపించింది. బెంగళూరు బౌలర్లలో లారెన్ బెల్, సయాలీ చెరో 3, ప్రేమ రావత్ 2, క్లెర్క్ 1 వికెట్ పడగొట్టారు. ఆఖరి బంతికి నందని శర్మ రనౌట్ అయింది.
ఇవి కూడా చదవండి..
రాణించిన అభిజ్ఞాన్, వైభవ్.. బంగ్లాదేశ్ టార్గెట్ 239..