ర్యాపిడ్‌లో గుకే్‌షకు నాలుగో స్థానం
ABN , Publish Date - May 08 , 2026 | 02:07 AM
గ్రాండ్ చెస్ టూర్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నీలో భాగంగా జరిగిన ర్యాపిడ్ ఈవెంట్‌లో వరల్డ్ చాంప్ గుకేష్ దొమ్మరాజు...
వార్సా (పోలెండ్): గ్రాండ్ చెస్ టూర్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నీలో భాగంగా జరిగిన ర్యాపిడ్ ఈవెంట్‌లో వరల్డ్ చాంప్ గుకేష్ దొమ్మరాజు నాలుగో స్థానంలో నిలిచాడు. గురువారం జరిగిన ఏడో రౌండ్‌లో వషైర్ లాగ్రావె (ఫ్రాన్స్) చేతిలో ఓడిన గుకేష్.. 8వ రౌండ్‌లో ఫెడొసోవ్ (స్లొవేనియా)తో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. ఇక, 9వ రౌండ్‌లో కరువానా (అమెరికా)పై గెలిచాడు. మొత్తం 9 రౌండ్ల నుంచి 9 పాయింట్లతో నాలుగో స్థానం దక్కించుకొన్నాడు. హన్స్ నీమన్ (అమెరి కా) 13పాయింట్లతో ర్యాపిడ్ విజేతగా నిలిచాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పుపై స్పందించిన కర్ణాటక హోం మంత్రి
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక పదవికి రాజీనామా