Share News

వింబుల్డన్ ఓపెన్: చరిత్ర సృష్టించిన జకోవిచ్.. ఫెదరర్ రికార్డు బద్దలు

ABN , Publish Date - Jul 06 , 2026 | 10:35 AM

టెన్నిస్ స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌లో అత్యధిక మ్యాచ్ విజయాల రికార్డును నమోదు చేశాడు. ఈ క్రమంలో టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు.

వింబుల్డన్ ఓపెన్: చరిత్ర సృష్టించిన జకోవిచ్.. ఫెదరర్ రికార్డు బద్దలు
Wimbledon 2026

ఇంటర్నెట్ డెస్క్: టెన్నిస్ స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌లో అత్యధిక మ్యాచ్ విజయాల రికార్డును నమోదు చేశాడు. ఈ క్రమంలో టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. వింబుల్డన్‌లో 132వ ర్యాంక్ ప్లేయర్ రష్యాకు చెందిన రోమన్ సఫయిల్లీన్‌పై జకోవిచ్ 7-6 (8/6), 6-3, 3-6, 6-3తో నాలుగో రౌండ్‌లో విజయం సాధించాడు.


ఈ గెలుపుతో 106 వింబుల్డన్ మ్యాచ్ విజయాలు నమోదు చేసి గ్రాండ్‌స్లామ్ చరిత్రలో రెండో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా మార్టినా నవ్రాటిలోవా 120 విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కాగా పురుషుల విభాగంలో ఫెదరర్ 105 వింబుల్డన్ విజయాల రికార్డును బద్దలు కొట్టి జకోవిచ్ టాప్‌కి దూసుకెళ్లాడు. 39 ఏళ్ల జకోవిచ్.. వరుసగా తొమ్మిదోసారి వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరడం విశేషం. మొత్తం గ్రాండ్‌స్లామ్‌లలో అతడికిది 66వ క్వార్టర్ ఫైనల్ కావడం మరో రికార్డు. క్వార్టర్ ఫైనల్‌లో కెనడాకు చెందిన ఫెలిక్స్ ఆగర్-అలియాసిమ్ లేదా స్పెయిన్ ప్లేయర్ అలహాండ్రో డేవిడోవిచ్ ఫోకినా‌తో జకోవిచ్ తలపడనున్నాడు. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ యానిక్ సినర్‌తో సెమీఫైనల్‌లో బ్లాక్‌బస్టర్ పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:

ఇదే నాకు చివరి ప్రపంచ కప్: క్రిస్టియానో రొనాల్డో

ప్రపంచ కప్ నుంచి బ్రెజిల్ ఔట్.. నెయ్‌మార్ రిటైర్‌మెంట్

Updated Date - Jul 06 , 2026 | 10:56 AM