వైభవ్ లాంటి ప్లేయర్‌ను ఒక్కడినైనా తయారు చేశారా?: వసీం అక్రమ్
ABN , Publish Date - Sep 12 , 2026 | 11:33 AM
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ప్రశంసలు కురిపించాడు. ఈ క్రమంలో పాక్ క్రికెట్‌పై సంచలన విమర్శలు చేశాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ప్రశంసలు కురిపించాడు. ఈ క్రమంలో పాక్ క్రికెట్‌పై సంచలన విమర్శలు చేశాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పీఎస్ఎల్‌ను ఐపీఎల్‌తో పోలుస్తూ.. యువ బ్యాటర్ల ప్రతిభను వెలికితీయడంలో పాకిస్థాన్ లీగ్ విఫలమైందని విమర్శించాడు.
‘పీఎస్ఎల్ ప్రారంభమై పదేళ్లు దాటింది. కానీ ఆ లీగ్ నుంచి ఒక్క బ్యాటర్ అయినా జాతీయ జట్టులోకి వచ్చాడా? కొంతమంది మంచి బౌలర్లను తయారు చేశాం. కానీ చెప్పుకోదగ్గ యువ బ్యాటర్లను ఎంత మందిని తయారు చేశాం? వైభవ్ సూర్యవంశీ లాంటి బ్యాటర్ మన దగ్గర నుంచి వచ్చినప్పుడే పాకిస్థాన్ క్రికెట్‌లోనూ మార్పు కనిపిస్తుంది. పాకిస్థాన్‌లో యువ ప్లేయర్ల ప్రతిభను వెలికి తీయాలంటే క్లబ్ క్రికెట్ వ్యవస్థను పునరుద్ధరించాలని. సుదీర్ఘ ఫార్మాట్‌లో పలు కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. కరాచీ, లాహోర్‌లో క్లబ్ క్రికెట్ అభివృద్ధికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒక్కో నగరానికి రూ.10కోట్లు కేటాయించాలి. ఎందుకంటే అసలైన ప్రతిభ క్లబ్ క్రికెట్ నుంచే వస్తుంది’ అని వసీం అక్రమ్ వెల్లడించాడు.
ఓటమి అంచున..
పాకిస్థాన్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో మూడో టెస్టు మ్యాచ్ ఆడుతోంది. ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్ ఓడిన పాక్.. మూడో టెస్టులో కూడా ఓటమి అంచున నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 449 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌కు 129 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో కూడా ఓడితే పాక్.. ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అవుతుంది.
ఇవి కూడా చదవండి:
భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో విషాదం
యూఎస్ ఓపెన్: టియాఫో చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన బెన్ షెల్టన్