భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో విషాదం
ABN , Publish Date - Sep 12 , 2026 | 10:54 AM
భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి వి.శాంతకుమారన్ నాయర్(89) కన్నుమూశారు. అనారోగ్యంతో కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి వి.శాంతకుమారన్ నాయర్(89) కన్నుమూశారు. అనారోగ్యంతో కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. విదేశాల్లో ఉన్న బంధువులు రావాల్సి ఉండటంతో ఆదివారం మృతదేహాన్ని స్వగ్రామం కేరళలోని కోతమంగళానికి తరలించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
శాంతకుమారన్ నాయర్ ఎల్‌ఐసీలో జోనల్ మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయనకు భార్య టి.ఎన్. సావిత్రీదేవి, పిల్లలు దీపు, నివేదిత, దివ్య, శ్రీశాంత్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
అఫ్గాన్‌తో టీ20 సిరీస్.. తిలక్ వర్మ తుది జట్టులో ఉంటాడా?: ఏబీ డివిలియర్స్
అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్: బరిలోకి బుమ్రా.. పేస్ వేగానికి వైభవ్ విలవిల!