Share News

ఫీల్డింగ్‌లో కోహ్లీ ఎనర్జీ వేరే లెవల్.. ఇప్పటికీ టీమిండియాపై ఆ ప్రభావం: టి.దిలీప్

ABN , Publish Date - Aug 11 , 2026 | 11:16 AM

భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై మాజీ ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు ఫీల్డింగ్‌లో చూపించే ఎనర్జీ అద్భుతమని కొనియాడాడు. విరాట్ ప్రభావం జట్టులోని మిగతా ప్లేయర్లపైనా పడుతుందని వెల్లడించాడు.

ఫీల్డింగ్‌లో కోహ్లీ ఎనర్జీ వేరే లెవల్.. ఇప్పటికీ టీమిండియాపై ఆ ప్రభావం: టి.దిలీప్
T Dilip

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై మాజీ ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు ఫీల్డింగ్‌లో చూపించే ఎనర్జీ అద్భుతమని కొనియాడాడు. విరాట్ ప్రభావం జట్టులోని మిగతా ప్లేయర్లపైనా పడుతుందని వెల్లడించాడు. ప్రాక్టీస్‌లో చూపించే ఉత్సాహాన్నే.. మ్యాచ్‌లోనూ ప్రదర్శిస్తాడని తెలిపాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ గురించి దిలీప్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.


‘విరాట్ కోహ్లీ విషయానికి వస్తే.. ఫీల్డింగ్ విషయంలో రాజీ పడడు. పవర్ ప్లేలో కవర్స్, షార్ట్ మిడ్ వికెట్ వంటి స్థానాల్లో అతడి రిఫ్లెక్సులు, డైవ్స్‌, బంతిని ఆపే విధానం అద్భుతంగా ఉంటుంది. బంతి తన వైపు రానప్పుడు కూడా అతడి ఫీల్డింగ్‌ ప్రయత్నాలు ఆగవు. నాన్‌స్ట్రైకర్‌ వైపు పరుగెత్తి త్రో అందుకుని వికెట్‌ కీపర్‌కు బంతిని అందిస్తుంటాడు. విరాట్ ఇప్పటికే టెస్టు, టీ20లకు వీడ్కోలు చెప్పేశాడు. కెరీర్‌లో ఈ దశలోనూ చివరి ఓవర్లలో లాంగ్‌ ఆన్‌లో ఫీల్డింగ్‌ చేస్తాడు. అక్కడి నుంచి పరుగెత్తుకొస్తాడు. అతడి తీవ్రత పక్కనున్న వారికీ అంటుకుంటుంది. విరాట్‌ ప్రాక్టీస్‌లో ఎలా ఉంటాడో.. మ్యాచ్‌లోనూ అలాగే ఉంటాడు. అతడితో కలిసి ఫీల్డింగ్‌ చేసే మిగతా ఆటగాళ్లు కూడా తమ స్థాయిని మరింత పెంచుకుంటారు. జట్టుపై అతడి ప్రభావం ఇప్పటికీ ఉంది’ అని దిలీప్‌ వివరించాడు.


2021 నవంబర్‌లో టీమిండియా సహాయక బృందంలో చేరిన దిలీప్‌.. ఇటీవలే ఫీల్డింగ్‌ కోచ్‌గా బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతడి హయాంలో భారత్‌ 2024, 2026 టీ20 ప్రపంచకప్‌లతో పాటు 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2023, 2025 ఆసియా కప్‌ టైటిళ్లు సాధించింది. 2023 వన్డే ప్రపంచకప్‌, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ రన్నరప్‌గా నిలిచింది. జింబాబ్వే పర్యటన అనంతరం దిలీప్‌ కాంట్రాక్ట్‌ను బీసీసీఐ పొడిగించలేదు. అతడి స్థానంలో భారత మాజీ క్రికెటర్ శుభదీప్‌ ఘోష్‌ ఫీల్డింగ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

వన్డే ప్రపంచ కప్ 2027: వెస్టిండీస్‌కు షాక్.. డైరెక్ట్ క్వాలిఫికేషన్ మిస్

నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్

Updated Date - Aug 11 , 2026 | 11:23 AM