Share News

టీ20 ప్రపంచ కప్: విండీస్‌ చిత్తు.. సౌతాఫ్రికా ఘన విజయం

ABN , Publish Date - Feb 26 , 2026 | 06:23 PM

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని ప్రొటీస్.. 1 వికెట్ కోల్పోయి 16.1 ఓవర్లలోనే ఛేదించింది.

టీ20 ప్రపంచ కప్: విండీస్‌ చిత్తు.. సౌతాఫ్రికా  ఘన విజయం
T20 World Cup

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని ప్రొటీస్.. 1 వికెట్ కోల్పోయి 16.1 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్(82*; 46 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగారు. ఓపెనర్ క్వింటన్ డికాక్(47) రాణించారు. ర్యాన్ రికెల్టన్(45*) అజేయంగా నిలిచాడు. దీంతో సౌతాఫ్రికా రెండు విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.


సఫారీ బ్యాటర్లను ఔట్ చేయడానికి విండీస్ బౌలర్లు తీవ్రంగా చెమటోడ్చారు. రోస్టన్ ఛేజ్ మాత్రమే వికెట్ పడగొట్టగలిగాడు. మిగతా బౌలర్లంతా ధాటిగా పరుగులు సమర్పించుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగుల చేసింది. షెఫర్డ్(52*) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. హోల్డర్(49) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సఫారీ బౌలర్లలో ఎంగిడి 3, రబాడా, బోష్ తలో 2 వికెట్లు పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

రెండో పెళ్లి చేసుకుంటా: పాక్ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. సత్తాచాటిన ఇషాన్ కిషన్

Updated Date - Feb 26 , 2026 | 06:24 PM