టీ20 ప్రపంచ కప్-2026: రాణించిన కుశాల్ మెండిస్.. శ్రీలంక స్కోర్ 163/6
ABN , Publish Date - Feb 08 , 2026 | 09:12 PM
టీ20 ప్రపంచ కప్-2026లో భాగంగా కొలంబో వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక 163 పరుగులు చేసింది. టాస్ ఓడి.. మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్-2026లో భాగంగా కొలంబో వేదికగా శ్రీలంక, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడిన శ్రీలంక మొదట బ్యాటింగ్ కు దిగింది. కుశాల్ మెండిస్(56*) అర్ధ సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కమిండు మెండిస్(44), పాతుమ్ నిస్సాంక(24), కమిల్ మిషారా(14) కూడా రాణించడంతో శ్రీలంక మంచి స్కోర్ చేసింది. ఇక ఐర్లాండ్ బౌలర్లలో బెర్రీ మెక్కార్తీ, జార్జ్ డాక్రెల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అలానే గారెత్ డెలానీ, మార్క్ అడైర్ చెరో వికెట్ తీసుకున్నారు.
ఐదో వికెట్ కు కమిండు మెండిస్, కుశాల్ మెండిస్ 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ప్రారంభం నుంచి కూడా శ్రీలంక బ్యాటర్లు దూకుడుగా ఆడలేదు. అలానే క్రమం తప్పకుండా వికెట్లు పడుతుండటంతో శ్రీలంక స్కోర్ బోర్డు నెమ్మందిగా కదిలింది. చివర్లో కమిండు మెండిస్ ఐర్లాండ్ బౌలర్లపై విరుచుకపడ్డాడు. కేవలం 19 బంతుల్లోనే 44 పరుగులు చేశాడు. ఐదో వికెట్ గా మెండిస్ పెవిలియన్ చేరడంతో పరుగులు పెడుతున్న స్కోర్ బోర్డుకు బ్రేక్ పడింది. మొత్తంగా ఐర్లాండ్ ముందు 164 పరుగుల టార్గెంట్ లంక జట్టు ఉంచింది.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్-2026: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం..