Share News

ముక్కోణపు సిరీస్: అఫ్గాన్-ఎ చిత్తు.. ఫైనల్‌కు శ్రీలంక-ఎ

ABN , Publish Date - Jun 19 , 2026 | 05:44 PM

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్థాన్-ఎ జట్టుపై శ్రీలంక-ఎ జట్టు 103 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో శ్రీలంక ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత్-ఎ జట్టుతో ఫైనల్ పోరులో తలపడనుంది.

ముక్కోణపు సిరీస్: అఫ్గాన్-ఎ చిత్తు.. ఫైనల్‌కు శ్రీలంక-ఎ
Sri Lanka A, Afghanistan A

ఇంటర్నెట్ డెస్క్: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్థాన్-ఎ జట్టుపై శ్రీలంక-ఎ జట్టు 103 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో శ్రీలంక ఫైనల్‌కు దూసుకెళ్లింది. అక్కడ భారత్-ఎ జట్టుతో ఫైనల్ పోరులో తలపడనుంది. 323 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్.. 219 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ హస్సన్(74) హాఫ్ సెంచరీతో పోరాడాడు.


తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక-ఎ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 322 పరుగుల భారీ స్కోర్ చేసింది. అవిష్కా ఫెర్నాండో(110) సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్ నిరోషన్ డిక్వెల్లా(66) హాఫ్ సెంచరీ చేశాడు. నవనిందు ఫెర్నాండో(45) రాణించాడు. అఫ్గాన్ బౌలర్లలో ఫరిదూన్ 4, ఫర్మానుల్లా 3, మహ్మద్ ఇబ్రహీం 1 వికెట్ పడగొట్టారు. 323 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్ జట్టు పూర్తిగా తడబడింది. ఓపెనర్ హస్సన్(74) హాఫ్ సెంచరీ చేశాడు. ఫర్మానుల్లా సాఫీ(43), బహిర్ షా(35) పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లంతా తీవ్రంగా విఫలమయ్యారు. దీంతో 42.5 ఓవర్లలో 219 పరుగులకు అఫ్గాన్ ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో దులాజ్ సముదితా 5 వికెట్లతో చెలరేగాడు. మథులాన్ 3, రవిందు ఫెర్నాండో, విజయకాంత్ తలొక వికెట్ పడగొట్టారు. కాగా దంబుల్లా వేదికగా ఆదివారం భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి.


ఇవి కూడా చదవండి:

ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్!

టీమిండియాకు కోచ్ అవసరం లేదు.. గంభీర్‌పై శ్రీశాంత్ విమర్శలు

Updated Date - Jun 19 , 2026 | 06:11 PM