Share News

Siraj Four Wickets: చెలరేగిన సిరాజ్.. బెంగాల్ బ్యాటర్లకు చుక్కలు

ABN , Publish Date - Jan 06 , 2026 | 07:27 PM

విజయ్ హజారే ట్రోఫీ 2025-26 టోర్నీలో బెంగాల్ జట్టుపై హైదరాబాదీ స్పీడ్ స్టర్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. ఏకంగా నాలుగు వికెట్లు తీసి.. హైదరాబాద్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిరాజ్ దెబ్బకు బెంగాల్ బ్యాటర్లు విలవిల్లాడారు.

Siraj Four Wickets: చెలరేగిన సిరాజ్.. బెంగాల్ బ్యాటర్లకు చుక్కలు
Mohammed Siraj

ఇంటర్నెట్ డెస్క్: విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా మంగళవారం బెంగాల్ తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం సాధించింది. అమన్ రావు అద్భుతమైన డబుల్ సెంచరీ, హైదరాబాదీ స్పీడ్ స్టర్ మహమ్మద్ సిరాజ్ సూపర్ బౌలింగ్( Mohammed Siraj bowling)తో హైదరాబాద్ అపూర్వ విజయం అందుకుంది. మంగళవారం రాజ్‌కోట్ వేదికగా బెంగాల్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 107 ప‌రుగుల తేడాతో హైద‌రాబాద్ ఘన విజయం సాధించింది.


నిప్పులు చెరిగిన సిరాజ్‌..

ఈ మ్యాచ్‌(Hyderabad vs Bengal)లో మొద‌ట బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. అనంత‌రం 353 ప‌రుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన బెంగాల్ జ‌ట్టు 44.4 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. త్వరలో జరగనున్న న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సన్నాహకంగా ఈ టోర్నీ ఆడుతున్న మహమ్మద్ సిరాజ్(Mohammed Siraj bowling).. ఈ మ్యాచ్‌లో నిప్పులు చెరిగాడు. సిరాజ్ తన 10 ఓవర్ల కోటాలో 58 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ దెబ్బకు బెంగాల్ బ్యాటర్లు విలవిల్లాడారు. సిరాజ్ తో పాటు నితీష్ రెడ్డి రెండు, సీవీ మిలింద్‌, రక్షణ్‌, నితిన్ తలా వికెట్ పడగొట్టారు. ఇక బెంగాల్ బ్యాటర్లలో షహబాజ్ అహ్మద్ ఒంటరి పోరాటం చేశాడు. అతను113 బంతుల్లో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ లో జట్టులో యువ ఓపెనర్ అమన్ రావు అద్భుతమైన డబుల్ సెంచరీతో చెల‌రేగాడు. కేవలం 154 బంతుల్లో 200 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. లిస్ట్-ఏ మ్యాచుల్లో అతడికి ఇదే తొలి శతకం కావడం గమన్హారం.


కాగా హైదరాబాద్(Hyderabad) ప్రస్తుతం గ్రూపు-బి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ జట్టుకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ భారీ తేడాతో గెలవాల్సి ఉంది. అంతేకాకుండా మిగత జట్ల ఫలితాలపై కూడా ఆధారపడి ఉంటుంది.



ఇవి కూడా చదవండి:

విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాదీ ప్లేయర్ డబుల్ సెంచరీ..

బీసీసీఐకి మరో కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయిన బంగ్లాదేశ్

Updated Date - Jan 06 , 2026 | 08:13 PM